
ముఖ్యంగా క్రికెట్లో ఉన్న మిగతా ఫార్మాట్లోలో ఎలా ఉన్నప్పటికీ అటు టీ20 ఫార్మాట్ అంటేనే ఎన్నో మెరాకిల్స్ కి కేరాఫ్ అడ్రస్ గా ఉంటుంది. రెప్పపాటు కాలంలో ఏమైనా జరగొచ్చు అన్న విధంగానే టీ20 లలో ఉత్కంఠ కొనసాగుతూ ఉంటుంది అని చెప్పాలి. ఇకపోతే ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా టీ20 లీగ్ ఎంతో ఉత్కంఠ భరితంగా జరుగుతుంది. ప్రతి మ్యాచ్ కూడా హోరాహోరీగా జరుగుతూ ప్రేక్షకులకు అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ అందిస్తూ ఉంది అని చెప్పాలి. ఇకపోతే ఇటీవల సౌత్ ఆఫ్రికా టీ20 లీగ్ లో భాగంగా ఒక అరుదైన రికార్డును సృష్టించాడు ఆల్ రౌండర్ కైల్ మేయర్స్.
వరల్డ్ క్రికెట్ హిస్టరీ లోనే ఇక ఇలాంటి రికార్డు ఇప్పటివరకు ఏ ఆటగాడికి సాధ్యం కాలేదు అని చెప్పాలి. సాధారణంగా ఆల్రౌండర్లు అన్న తర్వాత బ్యాటింగ్లో మెరుపులు మెరుపుస్తూ బౌలింగ్లో ప్రత్యర్థులకు చుక్కలు చూపించడం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే ఇటీవల సౌత్ ఆఫ్రికా టీ20 లీగ్ లో భాగంగా ప్రిటోరియా క్యాపిటల్ తో జరిగిన మ్యాచ్లో డర్బన్ సూపర్ జెయింట్స్ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న ఆల్రౌండర్ కైల్ మేయర్ బరిలోకి దిగాడు. అయితే తొలి బంతికి అతను డగ్ ఔట్ గా వెనుతిరిగాడు. అయితే ఆ తర్వాత ఇక ప్రిటోరియా క్యాపిటల్స్ ఇన్నింగ్స్ సమయంలో బౌలింగ్లో తొలి బంతికే వికెట్ తీశాడు. ఇలా తొలి బంతికే అవుట్ అయ్యి ఆ తర్వాత బౌలింగ్లో తొలి బంతికే వికెట్ తీసిన తొలి ఆటగాడిగా నిలిచాడు కైల్ మేయర్స్.