
ఇక ఈ ఏడాది ఇదే రేంజిలో విజృంభిస్తే విరాట్ కోహ్లీ సచిన్ 49 సెంచరీల రికార్డును బద్దలు కొట్టడం ఖాయం అనేది తెలుస్తుంది. ఈ క్రమంలోనే క్రికెట్ లెజెండ్ గా కొనసాగుతున్న సచిన్ టెండూల్కర్ గొప్ప లేకపోతే ప్రస్తుతం అదిరిపోయే ప్రదర్శనతో ఇప్పటికే లెజెండ్ గా నిరూపించుకున్న విరాట్ కోహ్లీ గొప్ప అనే చర్చ కూడా ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో జరుగుతుంది అని చెప్పాలి. ఇక ఇటీవలే అటు టీమిండియా తొలి ప్రపంచ కప్ కెప్టెన్ గా ఉన్న కపిల్ దేవ్ ఇక విరాట్ కోహ్లీ గొప్ప లేకపోతే సచిన్ టెండూల్కర్ గొప్ప అనే విషయంపై తనదైన శైలిలో సమాధానం చెప్పాడు.
ప్రతి జనరేషన్ మారుతున్న కొద్దీ పాత తరానికి మించిన ఆటగాళ్లు వస్తూ ఉంటారని.. తనవరకైతే సునీల్గా భాస్కర్ గొప్ప బ్యాటర్ అని ఇటీవలే కపిల్ దేవ్ వ్యాఖ్యానించాడు. ఎవరు గొప్ప అనే విషయంలో ఒకరో ఇద్దరినో ఎంచుకోవాల్సిన అవసరం లేదు. 11 మంది కలిసికట్టుగా ఆడాల్సిన ఆట క్రికెట్. నా వరకు అయితే నేను అదే నమ్ముతాను. ఇక నాకు వ్యక్తిగతంగా సొంత ఇష్టాలు అఇష్టాలు కూడా ఉంటాయి కదా. ప్రతి తరంలోనూ మనకు మెరుగైన ఆటగాళ్లు వస్తూనే ఉన్నారు. ఇక ఒకప్పుడు సచిన్ రాహుల్ వీరేంద్ర సెహ్వాగ్లు బాగా ఆడారు. ఇక ఆ తర్వాత రోహిత్ కోహ్లీ ఆట ఈ తరంలో బాగుంది. నా అభిప్రాయం ప్రకారమైతే అత్యుత్తమ బ్యాట్స్మెన్లలో సునీల్ గవాస్కర్ ఒక్కరు అంటూ చెప్పుకొచ్చాడు కపిల్ దేవ్.