టి20 వరల్డ్ కప్ గెలవడమే  లక్ష్యంగా ప్రస్తుతం భారత మహిళల జట్టు ఐసీసీ టోర్నిలో బరిలోకి బలులోకి దిగేందుకు సిద్ధమైంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ వరల్డ్ కప్ లో భాగంగా ఇక భారత జట్టు ఎంతో పటిష్టంగా కనిపిస్తుంది అని చెప్పాలి. అయితే ఇక ఈనెల 13వ తేదీన టి20 వరల్డ్ కప్ లో భాగంగా టీమిండియా మొదటి మ్యాచ్ ఆడబోతుంది అని చెప్పాలి. అయితే మొదటి మ్యాచ్ అందరూ ఎదురు చూస్తున్నట్లుగానే చిరకాల ప్రత్యర్థులుగా పిలవబడే భారత్ పాకిస్తాన్ మధ్య ఉండబోతుంది అన్నది తెలుస్తుంది.


 అయితే ఇక క్రికెట్ ప్రేక్షకులందరూ కూడా టీమిండియా పాకిస్తాన్ మ్యాచ్ కోసం వెయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే మరోవైపు ఇక ఈనెల 13వ తేదీ రోజున ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా మెగా వేలం ప్రక్రియ జరగబోతుంది అని చెప్పాలి. మహిళా క్రికెటర్లు ఎంత ధర పలకబోతున్నారు అన్నది హాట్ టాపిక్ మారిపోయింది. అయితే ఎంతోమంది విశ్లేషకులు అటు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలంపై కూడా దృష్టి పెట్టారు.  కాగా ఇదే విషయంపై స్పందించిన భారత మహిళలు జట్టు కెప్టెన్ హార్మన్ ప్రీత్ కౌర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది అని చెప్పాలి.


 ఈనెల 13వ తేదీన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా వేలం నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ తమ దృష్టి మొత్తం ఇక వరల్డ్ కప్ లో భాగంగా పాకిస్తాన్తో జరగబోయే మ్యాచ్ పైనే ఉంది అంటూ స్పష్టం చేసింది హార్మన్ ప్రీత్.  ముఖ్యంగా ఐసీసీ ట్రోఫీ గెలవడం పైనే మా అందరి ఫోకస్ ఉంది అంటూ చెప్పుకొచ్చింది. ఒక ప్లేయర్ గా మాకు ఏది ముఖ్యం అనే విషయంపై ఒక క్లారిటీ ఉంది అంటూ చెప్పుకొచ్చింది. అయితే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ కారణంగా మహిళల క్రికెట్ మరింత మెరుగుపడే ఛాన్స్ ఉంది అంటూ ఆశ భవం వ్యక్తం చేసింది. అయితే పాకిస్తాన్తో జరగబోయే మ్యాచ్లో భారత జట్టు ఎలా చిరకాల ప్రత్యర్థిని చిత్తూ  చేయబోతుంది అన్నది చూసేందుకు భారత ప్రేక్షకులందరూ ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Wpl