2023 ఏడాదిలో జరగబోయే ఆసియా కప్ గురించి గత కొంతకాలం నుంచి ప్రపంచ క్రికెట్లో తీవ్రమైన చర్చ జరుగుతూ ఉంది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే ఆసియా కప్ పాకిస్తాన్ వేదికగా జరగబోతుంది. అయితే భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య క్రికెట్ సంబంధాలపై నిషేధం కొనసాగుతూ ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక పాకిస్తాన్ వేదికగా ఆసియా కప్ నిర్వహిస్తే ఇక భారత జట్టు పాకిస్తాన్లోకి వెళ్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. అయితే దీనిపై స్పందించిన బీసీసీఐ తాము తటస్థ వేదికపై ఆసియా కప్ నిర్వహిస్తేనే టోర్నీలో కొనసాగుతామని లేదంటే తప్పుకుంటాము  అంటూ బీసీసీఐ స్పష్టం చేసింది.


 అయితే ఇది క్రీడా స్ఫూర్తికి విరుద్ధం అంటూ ఎంతో మంది పాకిస్తాన్ ఆటగాళ్లు విమర్శలు కూడా చేశారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఇప్పుడు ఎసిసి ఆసియా కప్ వేదికను మార్చేందుకు కూడా పాకిస్తాన్ క్రికెట్ బోర్డుతో చర్చలు జరిపింది. కాగా ఇటీవల ఇదే విషయంపై మాట్లాడిన పాకిస్తాన్ మాజీ ఆటగాడు షాహిద్ ఆఫ్రిది ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. బీసీసీఐ ఏకంగా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ని కూడా కంట్రోల్ చేయగలదు అంటూ వ్యాఖ్యానించాడు. ఆసియా కప్ లో ఆడేందుకు టీమ్ ఇండియా మా దేశానికి వస్తుందో లేదో అన్న విషయంపై స్పష్టత లేదు.


 ఇక భారత్ ఆతిథ్యం ఇచ్చే వన్డే వరల్డ్ కప్ ను పాకిస్తాన్ బహిష్కరిస్తుందో లేదో కూడా తెలియదు. ఈ విషయంపై ఒక నిర్ణయానికి రావాలి. ఇప్పుడు ఐసీసీ పాత్ర కీలకం. వాళ్లే ముందుకు వచ్చి సమస్య పరిష్కరించాలి. కానీ బీసీసీఐ ముందు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ కూడా ఏమీ చేయలేదు. తమ కాళ్ళ మీద తాము నిలబడలేని వాళ్ళు బలమైన నిర్ణయాలు తీసుకోలేరు. ఇక ప్రస్తుతం ఐసీసీ పరిస్థితి కూడా ఇలాగే ఉంది అంటూ షాహిద్ ఆఫ్రిది చెప్పుకొచ్చాడు. ఇక రానున్న రోజుల్లో అయినా ఈ రెండు మెగా టోర్నీలు ఎక్కడ నిర్వహిస్తారు అనే విషయంపై  క్లారిటీ వస్తుందేమో చూడాలి. ఇదే విషయంపై తీవ్రమైన చర్చ జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: