మార్చ్ 31వ తేదీ నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం కాబోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే 2023 ఐపీఎల్ కు సంబంధించి పూర్తి షెడ్యూల్ ఇటీవల బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. ఈ క్రమంలోనే తాము ఎప్పుడు మ్యాచులు ఆడబోతున్నాము అనే విషయంపై అన్ని జట్లకు కూడా ఒక క్లారిటీ వచ్చేసింది. ఈ క్రమంలోనే ఇక ప్రత్యర్ధులను ఎదుర్కొనేందుకు పదునైన వ్యూహాలను సిద్ధం చేసుకునే పనిలో ఇక అన్ని జట్లు కూడా సిద్ధమవుతున్నాయి అని చెప్పాలి. ఇంకా కొంతమంది ఆటగాళ్లు అయితే ప్రస్తుతం ప్రాక్టీస్ లో మునిగి తేలుతూ ఉన్నారు.


 అయితే గత ఏడాది పేలవ ప్రదర్శన చేసిన చెన్నై సూపర్ కింగ్స్ ఇక ఈ ఏడాది మాత్రం టైటిల్ కొట్టడమే లక్ష్యంగా బరిలోకి దిగేందుకు సిద్ధం అవుతుంది. ఈ క్రమంలోనే చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి బెన్ స్టోక్స్ ని భారీ ధర వెచ్చించి మరి వేలంలో కొనుగోలు చేసింది అన్న విషయం తెలిసిందే. దీంతో ధోని తర్వాత ఇక చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టబోయేది ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ అని అందరూ భావించారు. ఈ సీజన్లోనే బెన్ స్టోక్స్ కి సారధ్య బాధ్యతలు అప్పగించడం ఖాయమని అనుకున్నారు.  అయితే ఇలా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్సీ బాధ్యతలు చేపడతాడు అనుకున్న బెన్ స్టోక్స్ ఇక ఇప్పుడు చెన్నై జట్టుకే షాక్ ఇచ్చాడు అన్నది తెలుస్తుంది.



 ఈసారి ఎట్టి పరిస్థితుల్లో టైటిల్ గెలవాలనే లక్ష్యంతో బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్న చెన్నై సూపర్ కింగ్స్ కు బెన్ స్టోక్స్ ట్విస్ట్ ఇచ్చాడు. ఐపీఎల్ చివరి దశ మ్యాచ్లకు అతను అందుబాటులో ఉండడు అన్న విషయం తెలుస్తుంది. ఇంగ్లాండ్, ఐర్లాండ్ మధ్య టెస్ట్ సిరీస్ ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలోనే ఇలాంటి సమయంలో దేశానికి ఆడడానికే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తానని బెన్ స్టోక్స్ చెప్పుకొచ్చాడు. దీంతో ఇక చివరి దశ ఐపిఎల్ మ్యాచ్ లకు అతను దూరం కాబోతున్నాడు అన్నది తెలుస్తుంది. ఇకపోతే గత ఏడాది చివర్లో జరిగిన వేలంలో అతన్ని 16.25 కోట్లు పెట్టి చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: