ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో స్టార్ ప్లేయర్ గా కొనసాగుతూ ఉన్నాడు ఆస్ట్రేలియా ప్లేయర్ డేవిడ్ వార్నర్.. ఇక తన ఆట తీరుతో ప్రపంచవ్యాప్తంగా కూడా కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే గత కాలం నుంచి మాత్రం డేవిడ్ వార్నర్ కెరియర్ లో ఊహించని పరిణామాలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా క్రికెట్ ఆస్ట్రేలియా కు వ్యతిరేకంగా అతను పోరాటం చేస్తున్నాడు అని చెప్పాలి.  ఎందుకంటే అతనిపై జీవితకాల కెప్టెన్సీ నిషేధం ఎత్తివేయడంపై అటు క్రికెట్ ఆస్ట్రేలియా మొగ్గు చూపలేదు.


 అదే సమయంలో ఇక డేవిడ్ వార్నర్ కు సంబంధించిన ప్రతి విషయంలో కూడా అటు క్రికెట్ ఆస్ట్రేలియా కఠినంగానే వ్యవహరిస్తుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే డేవిడ్ వార్నర్ త్వరలో రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడు అన్న వార్త కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇదే విషయం గురించి డేవిడ్ వార్నర్ స్పందించాడు. ఒకవేళ తన టెస్ట్ కెరియర్ ముగింపు పలకాలని సెలెక్టర్ నిర్ణయిస్తే 2024 వరకు పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడతానని డేవిడ్ వార్నర్ చెప్పుకొచ్చాడు. అంతేకాదు ఈ ఏడాది జరగబోయే యాషెష్ సిరీస్ లో కూడా తుది జట్టులోకి ఎంపిక అవుతాను అని ఆశాభావం వ్యక్తం చేశాడు ఈ సీనియర్ ప్లేయర్.


 కాగా ఇటీవలే మోచేతి గాయం కారణంగా బోర్డర్ గవస్కర్ ట్రోఫీ నుంచి అర్ధాంతరంగా తప్పుకున్న డేవిడ్ వార్నర్ స్వదేశానికి పయనం అయ్యాడు అన్న విషయం తెలిసిందే. అంతకుముందు ఆడిన రెండు టెస్టు మ్యాచ్ లలో కూడా ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయలేదు. వరుసగా మూడు ఎన్ని ఇన్నింగ్స్ లో 1, 10, 15 స్కోర్ మాత్రమే చేసిన డేవిడ్ వార్నర్.. రెండవ టెస్ట్ నాలుగవ ఇన్నింగ్స్ లో కంకషన్ కారణంగా ఆడలేదు అని చెప్పాలి. రాబోయే 12 నెలల్లో జట్టు ఎంతో క్రికెట్ ఆడుతుంది. పరుగులు సాధిస్తున్నంత కాలం నా స్థానం కాపాడుకోగలను. అది జట్టుకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. సాధారణంగా 36 నుంచి 37 సంవత్సరాల వయసులోకి వెళ్తున్న ఆటగాడి పట్ల విమర్శలు సహజం అంటూ డేవిడ్ వార్నర్  చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: