క్రికెట్ అంటేనే ఎన్నో విన్యాసాలకు పెట్టింది పేరు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఒక్కోసారి బ్యాట్స్మెన్లు తమ ప్రతిభతో మ్యాజిక్ చేస్తూ ఉంటే మరికొన్ని సార్లు ఫీల్డర్లు అద్భుతమైన క్యాచ్లు పట్టేందుకు విన్యాసాలు చేస్తూ ఉంటారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే మెరుపు వేగంతో దూసుకు వస్తున్న బంతిని అంతకంటే వేగంగా అందుకొని ఇక ప్రత్యర్థిని పెవిలియన్ పంపించడమే లక్ష్యంగా విన్యాసాలు ఎన్నో చేస్తూ ఉంటారు. ఇలాంటిది ఏదైనా జరిగిందంటే చాలు అందుకు సంబంధించిన వీడియో కాస్త ట్విట్టర్ వేదిక వైరల్ గా మారిపోతు ఉంటుంది అని చెప్పాలి. ఐపిఎల్ లో అన్ సొల్డ్ గా మిగిలిపోయిన ఒక ఆటగాడు స్టన్నింగ్ క్యాచ్ తో ప్రస్తుతం అందరిని ఔరా అనిపించాడు.



 ఇక సదరు ఆటగాడు ఎవరో కాదు మైఖేల్ బ్రేస్ వెల్. ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టు ఇక టెస్ట్ సిరీస్ కోసం న్యూజిలాండ్లో పర్యటిస్తుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఇరుజట్ల మధ్య టెస్ట్ మ్యాచ్ హోరాహోరీగా జరుగుతుంది అని చెప్పాలి. తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ జట్టు మూడు వికెట్ల నష్టానికి 315 పరుగులు చేసింది. అయితే ఇంగ్లాండు తొలి మూడు వికెట్ల  కేవలం 21 పరుగుల వ్యవధిలోనే పడిపోయాయి అని చెప్పాలి. అయితే ఇలాంటి సమయంలోనే ఒక స్టన్నింగ్ క్యాచ్ పట్టి మైఖేల్ బ్రేజ్ వెల్ మెరిసాడు.  సౌతి బౌలింగ్లో బెన్ డకెట్ స్లిప్లో షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే అక్కడే ఉన్న మైకేల్ బ్రేస్ వెల్ మెరుపు వేగంతో గాల్లోకి ఎగిరి క్యాచ్ అందుకున్నాడు.



 ఏకంగా ఫుల్ లెన్త్ డైవ్ చేసి ఒంటి చేత్తో క్యాచ్ అందుకున్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఈ స్టన్నింగ్ క్యాచ్ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోవడంతో ఇది చూడటానికి క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా ఎంతగానో ఆసక్తి చూపుతున్నారు అని చెప్పాలి. కాగా బ్రేస్ వెల్ గత ఏడాది డిసెంబర్లో జరిగిన ఐపీఎల్ వేలంలో పాల్గొన్నాడు. అయితే ఏ ఫ్రాంచైజీ కూడా అతన్ని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు అని చెప్పాలి. దీంతో ఇక స్టార్ ప్లేయర్ అయినప్పటికీ కూడా ఐపీఎల్ లో అన్ సొల్డ్ ప్లేయర్ గానే మిగిలిపోయాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: