ప్రస్తుతం ఆస్ట్రేలియా భారత్ జట్ల మధ్య కీలకమైన చివరి టెస్ట్ మ్యాచ్ నేడు జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ టెస్ట్ మ్యాచ్లో భాగంగా ఇరు జట్లు కూడా హోరా హోరిగా పోరాడేందుకు సిద్ధమవుతున్నాయి. అయితే ఇప్పటికే జరిగిన మూడు మ్యాచ్లలో ఒక మ్యాచ్లో ఆస్ట్రేలియా గెలిస్తే మొదటి రెండు మ్యాచ్లలో టీమిండియా గెలిచింది. దీంతో 2-1 తేడాతూ ఆధిక్యంలో కొనసాగుతుంది టీమ్ ఇండియా. కాగా చివరి టెస్ట్ మ్యాచ్లో గెలిస్తేనే అటు టీమిండియా సిరీస్ కైవసం చేసుకునే అవకాశం ఉంది.


 అదే సమయంలో ఇక చివరి మ్యాచ్ లో గెలిస్తేనే అటు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో కూడా అడుగు పెట్టేందుకు ఛాన్స్ ఉంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే టీమ్ ఇండియా ప్రదర్శన ఎలా ఉంటుంది అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. ముఖ్యంగా భారత స్టార్ బౌలర్ అశ్విన్ ను నాలుగో టెస్ట్ లో ఒక అరుదైన రికార్డు ఊరిస్తుంది అని చెప్పాలి. భారత లెజెండరీ బౌలర్ అనిల్ కుంబ్లే  రికార్డును బద్దలు కొట్టే అవకాశం అశ్విన్కు ఉంది   ఆస్ట్రేలియాతో జరగబోయే చివరి టెస్టులో అశ్విన్ ఐదు వికెట్లు తీశాడు అంటే చాలు టెస్ట్ క్రికెట్లో ఆస్ట్రేలియాపై అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్గా అవతరిస్తాడు.



 ఇక ఈ లిస్టులో అనిల్ కుంబ్లే ఒక్క  ఆస్ట్రేలియా జట్టు పైనే 111 వికెట్లు పడగొట్టి ఎక్కువ వికెట్లు పడగొట్టిన ప్లేయర్గా టాప్ లో ఉన్నాడు. అశ్విన్ ఇప్పుడు వరకు 107 వికెట్లు మాత్రమే తీసి రెండో స్థానంలో ఉన్నాడు. ఇక వీరిద్దరూ మినహా మరే భారత బౌలర్ కూడా ఆస్ట్రేలియాపై 100 వికెట్ల మార్కు అందుకోలేదు.  ఈ క్రమంలోనే చివరి టెస్ట్ మ్యాచ్లో అశ్విన్ 5 వికెట్లు తీశాడు అంటే చాలు ఇక అనిల్ కుంబ్లేని వెనక్కి నెట్టి అగ్రస్థానంలోకి చేరుకుంటాడు అని చెప్పాలి. ఇక అశ్విన్ ఒకవేళ పదవి వికెట్లు పడగొడితే అన్ని ఫార్మాట్లలో కలిపి 700 వికెట్ల మైలురాయిని అందుకున్న ప్లేయర్గా నిలుస్తాడు. ఇప్పటివరకు అనిల్ కుంబ్లే  956, హర్భజన్ సింగ్ 707 వికెట్ల తో మొదటి రెండు స్థానాల్లో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: