ప్రస్తుతం ఆస్ట్రేలియా , భారత్ మధ్య జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా టీమ్ ఇండియాను గెలిపించడంలో అటు విరాట్ కోహ్లీ కీలకంగా మారుతాడని అందరు అనుకున్నారు. మొన్నటి వరకు పరిమిత ఓవర్ల ఫార్మాట్లో సెంచరీలతో చెలరేగిపోయిన  విరాట్ కోహ్లీ ఇక టెస్టు ఫార్మాట్లో కూడా అదే రీతిలో బ్యాటింగ్ చేస్తాడని భావించారు. కానీ ఊహించని రీతిలో అతను పేలవ ప్రదర్శన చేస్తూ విమర్శలు ఎదుర్కొంటున్నాడు అన్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు జరిగిన మూడు మ్యాచ్లలో కూడా పెద్దగా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు విరాట్ కోహ్లీ.


 అయితే ఇక అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్ లో మాత్రం విరాట్ కోహ్లీ అర్థ సెంచరీ తో ఆకట్టుకున్నాడు అని చెప్పాలి. దాదాపు 14 నెలల తర్వాత ఇలా కోహ్లీ బ్యాట్ నుంచి టెస్ట్ ఫార్మాట్లో హాఫ్ సెంచరీ రావడం గమనార్హం. ఇక ప్రస్తుతం మూడో రోజు ఆట ముగిసే సమయానికి 59 పరుగులతో విరాట్ కోహ్లీ నాటౌట్ గా ఉన్నాడు. అయితే ఇక ఈరోజు ఆటలో భాగంగా విరాట్ కోహ్లీ ఎంత మేరకు పరుగులు చేస్తాడు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. ఇదే విషయంపై భారత లెజెండరీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీ అర్థ సెంచరీని డబుల్ సెంచరీగా మార్చగల సత్తా ఉన్న ప్లేయర్ అంటూ చెప్పుకొచ్చాడు. ఒకవేళ డబుల్ సెంచరీ చేస్తే అలవోకగా  టీమిండియా విజయం సాధిస్తుంది అంటూ తెలిపాడు.


 కోహ్లీ పరుగుల దాహంతో ఉన్నాడని.. ఫామ్ లేమీ నుంచి బయటపడడానికి విరాట్ కోహ్లీకి ఇది ఒక మంచి అవకాశం అంటూ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. ఎవరైనా ఆకలితో ఉండి సరిపడా తిననప్పుడు తినడానికి ఏదైనా.. దొరికితే ఎందుకు వదిలేయాలి. కోహ్లీ విషయంలోనూ ఇదే వర్తిస్తుంది అంటూ గవాస్కర్ చెప్పుకొచ్చాడు. గత కొన్నెళ్లుగా టెస్ట్ ఫార్మట్ లో కోహ్లీ సెంచరీ చేయలేదు. దాన్ని భర్తీ చేయడానికి కోహ్లీ 250 పరుగులు చేయడం ఉత్తమ మార్గం అంటూ గవాస్కర్ తెలిపాడు. మరి ఇక ఇప్పుడు నాలుగో రోజు ఆటలో విరాట్ కోహ్లీ ఏం చేయబోతున్నాడు అన్నది మాత్రం ఆసక్తికరంగా మారిపోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: