ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో ఎంతోమంది స్టార్ ప్లేయర్లు ఉన్నప్పటికీ ఇక భారత జట్టులో కీలక ప్లేయర్గా కొనసాగుతున్న విరాట్ కోహ్లీ మాత్రం ఎప్పుడూ తన ఆట తీరుతూ అందరికంటే ముందు వరుసలోనే ఉంటాడు అని చెప్పాలి. అయితే ఇక ఇప్పటికే తాను జట్టులోకి వచ్చి పోయే ఆటగాడిని కాదు క్రికెట్ చరిత్రలో నిలిచిపోయే ఆటగాడిని అన్న విషయాన్ని విరాట్ కోహ్లీ నిరూపించాడు. ఎంతో మంది లెజెండరీ క్రికెటర్స్ సాధించిన రికార్డులను అలవోకగా బద్దలు కొట్టి తన పేరును లికించుకున్నాడు అని చెప్పాలి.


 అంతేకాదు ఇక ఇప్పటికీ కూడా ఏ స్టార్ ప్లేయర్ కి సాధ్యం కానీ ఎన్నో ప్రపంచ రికార్డులు విరాట్ కోహ్లీ పేరిట ఉన్నాయి అని చెప్పాలి. అయితే గత మూడేళ్ల వరకు కూడా వరుస వైఫల్యాలతో ఇబ్బంది పడిన విరాట్ కోహ్లీ ఇక ఇప్పుడు గడ్డు పరిస్థితిల నుంచి బయటపడి సెంచరీలతో చెలరేగిపోతున్నాడు. మొన్నటికి మొన్న వన్డే, టి20 లో సెంచరీ తో అదరగొట్టిన కోహ్లీ అటు ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ లో మొదటి మూడు మ్యాచ్లలో చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. దీంతో విమర్శలు కూడా వచ్చాయి. కానీ నాలుగో మ్యాచ్లో తన విశ్వరూపం చూపించాడు. ఏకంగా 186 పరుగులతో రాణించాడు అని చెప్పాలి.


 దీంతో ఎన్నో ప్రపంచ రికార్డులను కూడా కొల్లగొట్టాడు విరాట్ కోహ్లీ. అయితే ఇక కోహ్లీ ప్రదర్శన గురించి భారత మాజీ ఆటగాడు హర్భజన్ సింగ్ స్పందిస్తూ ప్రశంసలు కురిపించాడు అని చెప్పాలి. 30 ఏళ్లు దాటిపోతున్న కోహ్లీ ఫిట్నెస్ ఇంకా 24 ఏళ్ళ ఆటగాడిలాగే ఉంది. సచిన్ 100 సెంచరీల రికార్డును కోహ్లీ అధికమిస్తాడని బలంగా నమ్ముతున్న... కోహ్లీ ఫిట్నెస్ వయసు అతనికి సహకరిస్తుంది. ఇప్పటికే 75 సెంచరీలు చేశాడు. ఇక మరో 50 సెంచరీలు చేయగలడు అంటూ హర్భజన్ సింగ్ చెప్పుకొచ్చాడు. ఇది కేవలం విశ్వాసం మాత్రమే కాదు సాధ్యమయ్యే పనే అంటూ తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: