భారత్ , ఆస్ట్రేలియా మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతున్నన్ని రోజుల్లో కూడా భారత్లో ఉన్న పిచ్  గురించి తీవ్రమైన చర్చ జరిగింది అని చెప్పాలి. ముఖ్యంగా భారత్లో ఉన్న పిచ్ ల గురించి ఆస్ట్రేలియా మాజీ ఆటగాళ్లు స్పందిస్తూ విమర్శలు గుప్పించడం హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. అదే సమయంలో భారత మాజీ ఆటగాళ్లు కూడా స్పందిస్తూ ఆస్ట్రేలియా మాజీ లకు కౌంటర్లు ఇచ్చారు అని చెప్పాలి.


 అయితే ఇక ఇలా పిచ్ లకు సంబంధించి చర్చ జరుగుతున్న సమయంలో కొంతమంది ఆటగాళ్లు సైతం పిచ్ తో సంబంధం లేకుండా అద్భుతమైన ప్రదర్శన చేసి.. ఒక ఆటగాడిగా బలిలోకి దిగిన తర్వాత ఎలాంటి పరిస్థితుల్లోనైనా బాగా రాణించాల్సిందే అన్న విషయాన్ని నిరూపించారు అని చెప్పాలి. భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన నాలుగు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లో భాగంగా టీమ్ ఇండియా 2-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. కీలకమైన చివరి టెస్ట్ మ్యాచ్ డ్రాగ ముగియడంతో.. ఈ ఘనత సాధించింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇటీవల టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి పిచ్ గురించి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.


 భారత పిచ్ లపై ఇన్నాళ్లపాటు విమర్శలు చేసిన వాళ్ళు ఇక ఇప్పుడు సంతోషిస్తారు అనుకుంటున్నా అంటూ మాజీ కోచ్ రవి శాస్త్రి వ్యాఖ్యానించాడు. మూడు రోజుల్లో ముగిసిన మ్యాచ్ ఫలితాన్ని తెల్చిన పిచ్లు గొప్పవా.. లేకపోతే ఐదు రోజులు పాటు మ్యాచ్ జరిగిన ఎలాంటి ఫలితాన్ని ఇవ్వని పిచ్లు గొప్పవా అంటూ ప్రశ్నించాడు రవి శాస్త్రి. ప్రస్తుతం చర్చ జరగాల్సింది ఈ విషయంపైనే.. ఎలాంటి పిచ్ కావాలో మీరే చెప్పండి అంటూ ఆస్ట్రేలియా మాజీ ఆటగాళ్లపై కౌంటర్ వేశాడు అని చెప్పాలి. కాగా రవి శాస్త్రి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: