
కానీ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అంతకుమించి అనే రేంజ్ లోనే వరుస వైఫల్యాలతో ఇబ్బంది పడుతుంది అని చెప్పాలి. వరుసగా ఐదు మ్యాచ్లలో ఓడిపోయి అభిమానులు అందరిని కూడా నిరాశలో ముంచేసింది బెంగళూరు జట్టు. స్మృతి మందాన కెప్టెన్సీ లో ఎక్కడ సత్తా చాట లేకపోయింది అని చెప్పాలి. అయితే ఎట్టకేలకు ఇటీవల విజయాన్ని సాధించింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. అయితే ఇప్పుడు బెంగళూరు జట్టుకు అసలు ప్లే ఆఫ్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయా లేదా అన్నది మాత్రం హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.
అయితే ఇప్పుడు వరకు ఒకే ఒక మ్యాచ్ లో గెలిచి ఐదు మ్యాచ్లలో ఓడిపోయినప్పటికీ ఇంకా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకి ప్లే ఆఫ్ అవకాశాలు సజీవంగానే ఉన్నాయి అన్నది తెలుస్తుంది. వేరే మ్యాచ్ల ఫలితాలు ఆర్సిబికి కలిసి వచ్చే ఆర్సిబి మిగిలిన రెండు మ్యాచ్లు కచ్చితంగా గెలవాలి. ఇప్పటికే ఐదు మ్యాచ్లలో గెలిచినా ముంబై ప్లే ఆఫ్ చేరుకుంది. నాలుగు మ్యాచ్లు గెలిచిన ఢిల్లీ సైతం ప్లే ఆఫ్ చేరుకున్నట్లే. రెండు మ్యాచ్లు గెలిచిన యూపీ, ఒక మ్యాచ్ గెలిచిన గుజరాత్ సైతం ప్లే ఆఫ్ పోటీలో ఉన్నాయి అని చెప్పాలి. అయితే ఆర్సిబి మిగిలిన రెండు మ్యాచ్లు గెలవడంతో పాటు మెరుగైన రన్ రేట్ సాధిస్తే ప్లే ఆఫ్ లో అడుగుపెట్టే ఛాన్స్ ఉంది.