గత కొంతకాలం నుంచి భారత క్రికెట్ లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఏదైనా ఉంది అంటే అది సర్ఫరాజ్ ఖాన్ పేరే అని చెప్పాలి. దేశవాళీ క్రికెట్లో రంజీ ట్రోఫీ సహా అన్ని రకాల టోర్నీలలో కూడా అద్భుతమైన ప్రదర్శన చేశాడు. వరుస సెంచరీలతో చెలరేగిపోయి అందరి దృష్టిని కూడా తన వైపుకు తిప్పుకున్నాడు. దీంతో అంత టాలెంట్ ఉన్న అతన్ని చెత్త రాజకీయాలతో తొక్కేస్తున్నారు ఎందుకు అని ఎంతోమంది క్రికెట్ ప్రేక్షకులు కూడా బీసీసీఐపై ఆగ్రహం వ్యక్తం చేశారు అని చెప్పాలి.



 అయితే దేశవాళి క్రికెట్లో ప్రదర్శన ఆధారంగా అటు సర్ఫరాజ్ ఖాన్ టీమిండియాలోకి అయితే రాలేదు. కానీ ఇక అందరూ ఎదురుచూసే ఐపిఎల్ లో మాత్రం ఛాన్స్ దక్కించుకున్నాడు అని చెప్పాలి. ఢిల్లీ క్యాపిటల్స్ జడ్డు కోసం ఆడటానికి అతను సెలెక్ట్ అయ్యాడు. అయితే అటు దేశవాళీ క్రికెట్లో సెంచరీల మూత మోగించిన సర్ఫరాజ్ ఖాన్ ఐపీఎల్ కు వచ్చేసరికి మాత్రం పూర్తిగా చేతులెత్తేస్తున్నాడు. దీంతో మొన్నటి వరకు అతని టాలెంట్ను పొగిడిన వాళ్ళే ఇక ఇప్పుడు విమర్శలు గుప్పిస్తున్నారు అని చెప్పాలి.



 రిషబ్ పంత్ గాయం కారణంగా ఐపీఎల్ కు దూరం కావడంతో ఇక అతని స్థానంలో సర్పరాజ్ ను జట్టులోకి తీసుకున్నారు. ఇక అలాంటి స్టార్ ప్లేయర్ స్థానంలో వచ్చిన సర్ఫరాజ్ ఖాన్  అతనిలో సగమైన ఆడితే బాగుండేదేమో. కానీ బొత్తిగాఅతని బ్యాటింగ్లో పసలేకుండా పోయింది అని చెప్పాలి. ఇటీవలే గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మనసులో 34 బంతుల్లో 30 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇక సర్ఫరాజ్ స్లో బ్యాటింగ్ కారణంగా ఢిల్లీ క్యాపిటల్స్ రన్ రేట్ మధ్యలో దారుణంగా పడిపోయింది. దీంతో అతను ఐపీఎల్ కు పనికిరాడని కేవలం రంజీ మ్యాచ్లే ఆడుకోవాలి అంటూ ఎంతో మంది విమర్శలు చేస్తున్నారూ అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: