మరి కొన్నిసార్లు కీలకమైన మ్యాచులలో పసికూన అని తక్కువ అంచనా వేసిన జట్లే మంచి విజయాలను సాధించడం లాంటివి చూస్తూ ఉంటాం. ఈ ఏడాది భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక వన్డే వరల్డ్ కప్ లో క్వాలిఫై అయ్యేందుకు కొన్ని జట్లు ప్రస్తుతం క్వాలిఫైయర్ మ్యాచ్లు ఆడాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ క్రమంలోనే ఇటీవల ఐసీసీ వన్డే వరల్డ్ కప్ క్వాలిఫైర్ ప్లే ఆఫ్స్ లో భాగంగా జెర్సీ టీం పై యూఎస్ఏ బౌలర్ అలీ ఖాన్ సంచలన రికార్డును సృష్టించాడు అని చెప్పాలి.
ఈ మ్యాచ్లో 9.4 ఓవర్లు వేసిన అలీ ఖాన్ 32 పరుగులు ఇచ్చాడు. అయితే ఏకంగా కీలకమైన ఏడు వికెట్లు తీశాడు అని చెప్పాలి. వన్డే క్రికెట్ చరిత్రలో ఇక ఇవి అరుదైన గణాంకాలు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. వన్డే క్రికెట్ హిస్టరీలో ఇవి ఏడో బెస్ట్ గణంకాలు కావడం గమనార్హం. ఈ జాబితాలో చమిందా వాస్ 8/ 19, షాహిద్ ఆఫ్రిది 7/12, మెక్ గ్రాత్ 7/15, రషీద్ ఖాన్ 7/18, అండీ బిచేల్, 7/20 మురళీధరన్, 7/30 స్థానంలో ఉన్నారు అని చెప్పాలి.. ఇలా మంచి ప్రదర్శన కనబరిచిన బౌలర్ పై ప్రస్తుతం ప్రశంసలు కురిపిస్తున్నారు క్రికెట్ విశ్లేషకులు.