ఇటీవల కాలంలో ప్రపంచ క్రికెట్లో మన్కడింగ్ రూల్ అనేది ఒక పెద్ద వివాదంగా మారిపోతుంది అనే విషయం తెలిసిందే. ఇది పూర్తిగా క్రీడా స్ఫూర్తిగా విరుద్ధమని కొంతమంది మాజీ ప్లేయర్లు అభిప్రాయపడుతుంటే.. ఐసీసీ రూల్స్ ప్రకారమే ప్లేయర్లు ఆడుతున్నారని మరి కొంతమంది మన్కడింగ్ చేసే వారికి మద్దతుగా నిలుస్తున్నారు. ఇక ఇటీవల ఐపీఎల్ లో మన్కడింగ్ రూల్ కాస్త మరోసారి తెరమిదికి వచ్చింది అన్న విషయం తెలిసిందే. లక్నో బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో చివరి బంతికి ఒక పరుగు అవసరమైన సమయంలో హర్షల్ పటేల్ బౌలింగ్ వేస్తుండగా రవి బిష్ణయ్ బంతి వేయకముందే క్రీజు దాటి వెళ్ళాడు.



 ఈ క్రమంలోనే హర్షల్ పటేల్ రవి బిష్ణయ్ ను మన్కడింగ్ ద్వారా రన్ అవుట్ చేసాడు అన్న విషయం తెలిసిందే. ఇక ఇది కాస్త సంచలనంగా మారిపోయింది. అయితే నిబంధనల ప్రకారమైతే బౌలింగ్ వేసే ఉద్దేశం లేకపోయినా లేదా క్రీజు దాటి బయటకు వెళ్లిన మన్కడింగ్ చేయడానికి వీలులేదు. రూల్ ప్రకారం బౌలర్కు బంతి సంధించే ఉద్దేశం కలిగి  క్రీజు దాటకుండా ఉంటేనే రనౌట్ చేసేందుకు అవకాశం ఉంటుంది. దీంతో హర్షల్ పటేల్ కు బంతి సంధించే ఉద్దేశం లేకపోవడంతో ఎంపైర్ నాట్ అవుట్ గా ప్రకటించాడు. అయితే ఈ విషయంపై స్పందించిన హర్ష భోగ్లే షాకింగ్ కామెంట్స్ చేయగా.. ఇక ఈ వ్యాఖ్యలపై బెన్ స్టోక్స్  స్పందించాడు.



 ఈ క్రమంలోనే మన్కడింగ్ విషయంలో ఒక ఆసక్తికర ప్రతిపాదనను తెరమీదకి తీసుకువచ్చాడు అని చెప్పాలి. నాన్ స్ట్రైకింగ్ ఎండులో ఉన్న బ్యాట్స్మెన్ బౌలర్ బంతి వేయకముందే క్రీజు దాటితే మన్కడింగ్ చేయడానికి కాదు ఆరు పరుగులు పెనాల్టీ విధించాలి అంటూ బెన్ స్టోక్స్ కొత్త ప్రతిపాదనను తెరమీదకి తీసుకువచ్చాడు అని చెప్పాలి. ప్రముఖ వ్యాఖ్యాత అయిన హర్ష భోగ్ లే చేసిన వ్యాఖ్యలపై స్పందించిన బెన్ స్టోక్స్ ఇక ఈ రకంగా కామెంట్ చేసినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా అటు లక్నో బెంగళూరు జట్ల మధ్య చివరి బంతికి హర్షల్ పటేల్ మన్కడింగ్ చేయడానికి సంబంధించిన విషయం కాస్త హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl