అన్నదమ్ముల వలెను జాతులు, మతములన్నియు మెలగవలెనోయ్
ఈసురోమని మనుజులుంటే దేశమేగతి బాగుపడునోయ్.
చెట్టపట్టాల్ పట్టుకొని దేశస్థులంతా నడువవలెనోయి
తిండికలిగితే కండ కలదోయ్..కండ కలవాడేను మనిషోయ్.
దేశమనియెడి దొడ్డ వృక్షం, ప్రేమలను పూలెత్తవలెనోయ్.
పెళ్ళిళ్ళలో చూపించే ఒక్క జాతకమూ నిజం కాదు
మందగించక ముందు అడుగేయి, వెనుకపడితే వెనెకోనోయ్
మతం వేరైతేను యేమోయ్, మనసు వొకటై మనుషులుంటే
మనం చేస్తే లౌక్యం, అవతలి వాళ్ళు చేస్తే మోసం.
వట్టిమాటలు కట్టి పెట్టోయ్, గట్టి మేలు తలపెట్టోయ్
వ్యర్థ కలహం పెంచబోకోయ్ కత్తి వైరం కాల్చవోయ్
సొంత లాభము కొంత మానుకు, పొరుగువాడికి సాయపడవోయి
అందం తొందరగా కంటికి పాతబడి పోతుంది. సౌశీల్యానికి మాత్రమే ఎప్పుడూ నశించని ఆకర్షణ వుంటుంది.
తిండికలిగితే కండ కలదోయ్..కండ కలవాడేను మనిషోయ్.
ఈసురోమని మనుజులుంటే దేశమేగతి బాగుపడునోయ్. అంటూ గుర‌జాడ అప్ప‌రావు నాటి స‌మాజాన్నివేలుప‌ట్టి ముందుకు న‌డిపించాడు. కుళ్లును త‌న ర‌చ‌న‌ల‌తో క‌డిగేసాడు. మూఢ న‌మ్మ‌కాల‌ను చీల్చి చెండాడు. స్త్రీ స్వేచ్ఛ కోసం పోరాడారు.


గురజాడ అప్పారావు (1862 సెప్టెంబర్ 21 - 1915 నవంబర్ 30) ప్రముఖ రచయిత. గురజాడ అప్పారావు తన రచనల ద్వారా సాంఘిక పరివర్తనకు ప్రయత్నించిన మహాకవి, తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గొప్ప సాహితీకారులలో ఒకరు, హేతువాది. 19 వ శతాబ్దంలోను, 20 వ శతాబ్ది మొదటి దశకంలోనూ అతను చేసిన రచనలు ఈనాటికీ ప్రజల మన్ననలను పొందుతున్నాయి. గానూ భావించే ఆ రోజుల్లో అతను ప్రజలందరికీ అర్ధమయ్యే జీవ భాషలో రచనలు చేసారు. వీరి కన్యాశుల్కము నాటకానికి సాహితీ లోకంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ నాటకంలో అతను సృష్టించిన గిరీశం, మధురవాణి, రామప్ప పంతులు మొదలైన పాత్రలు ప్రఖ్యాతి పొందాయి. అభ్యుదయ కవితా పితామహుడు అని బిరుదు పొందిన అప్పారావు, తెలుగు సాహిత్యంలో వాడుక భాష ఒరవడికి కృషి చేసిన వారిలో ముఖ్యుడు. అతనుకు కవి శేఖర అనే బిరుదు కూడా ఉంది.


 20 వ శతాబ్ది మొదటి దశకంలోనూ ఆయన చేసిన రచనలు ఈనాటికీ ప్రజల మన్ననలను పొందుతున్నాయి. ప్రజలందరికీ అర్ధమయ్యే జీవ భాషలో రచనలు చేసారు. వీరి కన్యాశుల్కము నాటకానికి సాహితీ లోకంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ నాటకంలో ఆయన సృష్టించిన గిరీశం, మధురవాణి, రామప్ప పంతులు మొదలైన పాత్రలు ప్రఖ్యాతి పొందాయి. ఉపాధ్యాయుడిగానూ, డిప్యుటీ కలెక్టర్ ఆఫీసులో హెడ్‌క్లర్కుగానూ, విజయనగరం రాజు ఆస్థానంలోనూ, అధ్యాపకుడిగానూ పనిచేసిన గురజాడ- తొలుత ఆంగ్లంలో రాసినప్పటికీ, తర్వాత తెలుగులోకి మరలాడు. స్నేహితుడు గిడుగు రామ్మూర్తితో కలిసి వ్యావహారిక భాషోద్యమానికి నడుం బిగించాడు. విజయనగర కేంద్రంగా జరిగే ‘కన్యాశుల్కము’ నాటకంలో అక్కడి యాస భాషను ప్రవేశపెట్టాడు. పెద్ద కుటుంబాలనుంచి వచ్చినవారే నాయికానాయకులుగా సాహిత్యాన్ని ఆక్రమించుకుంటున్న కాలంలో వేశ్య మధురవాణిని నాయికను చేశాడు. వేశ్యావృత్తిని నిర్మూలించాలంటే, ముందుగా వేశ్యలను కూడా మనుషులుగా చూడటం అవసరమన్నాడు. గురజాడ. 20వ శతాబ్ది తొలినాళ్ళలో జరిగిన వ్యవహారిక భాషోద్యమంలో గురజాడ అప్పారావు తన సహాధ్యాయి గిడుగు రామమూర్తి పంతులుతో కలిసి పోరాటం జరిపారు. వారిద్దరూ కలిసి పత్రికల్లో, సభల్లో, మద్రాసు విశ్వవిద్యాలయంలో గ్రాంథిక భాషావాదులతో పోరాడారు. 1913లో అప్పారావు పదవీ విరమణ చేసారు. 53 సంవత్సరాల వయసులో 1915 నవంబర్ 30 న గురజాడ అప్పారావు మరణించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: