ఏటా జ‌రిగే బ్ర‌హోత్స‌వం ఈ సారి కూడా ఏకాంత బ్ర‌హ్మోత్స‌వంగానే మారిపోయింది. చిద్విలాస రూపాన్ని క‌నుల్లారా చూడాల‌నుకునే వారికి స్వామి ద‌ర్శనం కొవిడ్ కార‌ణంగా కొంద‌రికే! స్వామి త‌న వైభ‌వోపేత ఉత్స‌వ రూపాన్ని తిరు వీధుల న‌డ‌యాడుతూ చూపే సంద‌ర్భాల‌కు కొన్ని ఆంక్ష‌లు నేప‌థ్యంగా ఉన్నాయి. స్వామి న‌డ‌యాడితే ఆనందం.. స్వామి న‌వ్వితే ఆనందం..ఆనందమే బ్ర‌హ్మ త‌త్వం విష్ణు త‌త్వం శివ త‌త్వం..మ‌నం తత్వ సారాల  చెంత చిన్న‌వారం. మీరూ నేనూ స్వామిని బ్ర‌హోత్స‌వ వేళ కీర్తించ‌డం బాధ్య‌త. స్తుతించ‌డం బాధ్య‌త. ఇత‌రుల కోసం వారి మంచి కోసం ప్రార్థించ‌డం కూడా బాధ్య‌తే! తిరువీధుల స్వామి న‌డ‌యాడే వేళ బాధ్య‌త‌ను నిర్వ‌ర్తించాలి. బ్ర‌హ్మోత్స‌వ ఆనందాల‌ను పంచాలి. రేప‌టి నుంచి బ్ర‌హ్మోత్స‌వాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 15 వ‌ర‌కూ ఇవి సాగ‌నున్నాయి. ధ్వ‌జారోహ‌ణ‌తో ఆరంభం అయ్యే ఈ ఉత్స‌వాలు చ‌క్ర‌స్నానాల‌తో ముగుస్తాయి. 




వివిధ వాహ‌న సేవ‌ల్లో స్వామిని కీర్తించి, స్వామిని ద‌ర్శింప‌జేసి, అటుపై స్వామి ప్రాభవాన్ని వివ‌రించేందుకు వైదిక పండితులు సిద్ధం అవుతున్నారు. స్వామి వాకిట ఇప్పుడే కాదు ఎప్పుడూ ఆనంద ధామంలో నిత్య క‌ల్యాణం ప‌చ్చ‌తోర‌ణ‌మే అన్నది వాస్త‌వం. మ‌నిషి త‌న జీవితాన ఆనందాల‌ను వెతుక్కోవ‌డంలో త‌ప్పిదాలు చేస్తున్నాడు. ఆనందాలు సొంతం చేసుకోవ‌డంలోనూ త‌ప్పు చేస్తున్నాడు. పండుగ‌లు నిత్యానంద రూపాన్ని అందించి, జీవిత సారాన్ని క‌ళ్లెదుట వివ‌రిస్తాయి. సొంతం చేసుకోవ‌డంలో అర్థం ఉంది. ఏ పండుగ అయినా దైవాన్ని సొంతం చేసుకోమ‌నే చెబుతుంది. ఆధ్యాత్మిక‌త అన్న ప‌దాన్ని ఇలానే అర్థం చేసుకోవాలి. భ‌జ‌న‌, కీర్త‌న అన్న‌వి మాన‌సిక ప్ర‌శాంత‌త‌కు.. ఆరాధ‌న ఉప‌శ‌మ‌నానికి, ఉల్లాసానికి.. కానీ ప్రార్థ‌న నిత్యం చుట్టూ ఉండే వారి యోగం, క్షేమం కోరుకునేందుకు నిర్దేశితాలు.




ఇవీ వాహ‌న సేవ‌లు

ఏడో తారీఖు ఉద‌యం ధ్వ‌జారోహ‌ణం - రాత్రి  పెద్ద శేష వాహ‌నంపై ఊరేగింపు

ఎనిమిదో తారీఖు : చిన్నశేష వాహ‌న సేవ - రాత్రి  హంస వాహ‌న సేవ

తొమ్మిదో తారీఖు : సింహ వాహ‌న సేవ - రాత్రి  ముత్య‌పు పందిరి వాహ‌న సేవ

ప‌దో తారీఖు : క‌ల్ప వృక్ష వాహ‌న సేవ - రాత్రి  స‌ర్వ భూపాల వాహ‌న సేవ

ప‌ద‌కొండో తారీఖు : మోహినీ అవ‌తారం - రాత్రి  గ‌రుడ వాహ‌న సేవ

ప‌న్నెండో తారీఖు : సాయంత్రం సర్వ భూపాల వాహ‌న సేవ - రాత్రి  గ‌జ‌వాహ‌న సేవ

ప‌ద‌మూడో తారీఖు : సూర్య ప్ర‌భ వాహ‌న సేవ - రాత్రి  చంద్ర ప్ర‌భ వాహ‌న సేవ

ప‌ద్నాలుగో తారీఖు : స‌ర్వ భూపాల వాహ‌న సేవ - రాత్రి  అశ్వ వాహ‌న సేవ

ప‌దిహేనో తారీఖు :  చ‌క్ర స్నానం రాత్రి ధ్వ‌జావ‌రోహ‌ణం

మరింత సమాచారం తెలుసుకోండి:

ttd