రసవత్తంగా సాగుతున్న టీ20 మూడు సిరీస్‌లో భాగంగా భారత్ ఇప్పటికే తొలిమ్యాచ్ నెగ్గి 1-0తో ఆధిక్యంలో నిలిచింది... రెండో మ్యాచ్‌తోనే సిరీస్‌ను సొంతం చేసుకోవాలని ఆరాటపడుతోంది. ఇక ఈ మ్యాచ్‌లో ప్లేయింగ్ లెవన్‌లో మార్పులుండే అవకాశముంది. లోకల్ బ్యాట్స్‌మన్ సంజూ శాంసన్‌కు తుది జట్టులో చోటు దక్కుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇకపోతే టీ20 సిరీస్‌లో భాగంగా భారత మణికట్టు స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ అరుదైన రికార్డుకు అడుగు దూరంలో నిలిచాడు.

 

 

అదేమంటే ఇండియా తరపున అత్యధిక వికెట్లు సాధించిన ప్లేయర్‌గా నిలిచేందుకు అతనికి మరో వికెట్ కావాలి. ప్రస్తుతం 52 వికెట్లతో రవిచంద్రన్ అశ్విన్‌తో కలిసి సమంగా ఉన్నాడు. ఈ దశలో 46 మ్యాచ్‌ల్లో అశ్విన్ ఈ మైలురాయిని చేరితే.. చాహల్ మాత్రం కేవలం 35 మ్యాచ్‌ల్లోనే 52 వికెట్లు తీశాడు. రెండోస్థానంలో జస్‌ప్రీత్ బుమ్రా 42 మ్యాచ్‌ల్లో 51 వికెట్లతో ఉన్నాడు. ఇకపోతే హైదరాబాద్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో అత్యంత ప్రభావం చూపిన భారత బౌలర్ చాహలే. నిజానికి కీలక సమయంలో విండీస్ బ్యాట్స్‌మన్ హిట్‌మయర్, కెప్టెన్ కీరన్ పొలార్డ్‌ను పెవిలియన్‌కు పంపాడు. దీంతో విండీస్ అనుకున్న దానికంటే తక్కువ స్కోరుకే పరిమితమైంది.

 

 

ఈక్రమంలో తిరువనంతపురంలో జరిగే రెండో మ్యాచ్‌లోనూ టీమ్ మేనేజ్‌మెంట్ అతనిపై ఆశలు పెట్టుకుంది. బ్యాటింగ్‌కు స్వర్గధామంలాంటి ఉప్పల్ స్టేడియంలో రాణించిన చాహల్.. స్పిన్నర్లకు అనుకూలించే గ్రీన్‌ఫీల్డ్ మైదానంలో సత్తాచాటాలని భావిస్తోంది. ఇక భారత్‌తో తిరువనంతపురం లోని గ్రీన్‌ఫీల్డ్ స్టేడియం వేదికగా జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన వెస్టిండీస్ కెప్టెన్ కీరన్ పొలార్డ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో భారత్ ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగింది.

 

 

దీంతో సొంతమైదానంలో సంజూ శాంసన్ బరిలోకి దిగుతాడని ఆశించిన అభిమానులక నిరాశే ఎదురైంది. ఇకపోతే హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ అన్ని రంగాల్లో ఆధిపత్యం కనబర్చి, ప్రత్యర్థి 207 పరుగుల భారీస్కోరును ఉఫ్‌మని ఊదేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఓపెనర్ లోకేశ్ రాహుల్ సత్తాచాటడంతో కొండంత లక్ష్యాన్ని అవలీలగా సాధించింది.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: