ప్ర‌పంచ‌క‌ప్ టీ-20లో  పాకిస్తాన్ పై భార‌త్ ఓట‌మిపై సోష‌ల్ మీడియాలో ట్రోలింగ్ మాత్రం ఆగ‌డం లేదు. విజ‌యం సాధించిన‌ప్పుడల్లా అభిమాన ఆట‌గాళ్ల‌ను పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తేవారు. కానీ పాకిస్తాన్‌పై ఓట‌మిని త‌ట్టుకోలేక ట్విట్ట‌ర్‌,  ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌ల‌లో ట్రోలింగ్‌కు తెర‌లేపారు. కేవ‌లం ఆట‌గాళ్ల‌నే కాకుండా వారి భార్య‌ల‌ను కూడ ఇందులోకి లాగుతున్నారు. ఇప్ప‌టికే టీమ్ ఇండియా బౌల‌ర్ ష‌మీపై ఓ రేంజ్‌లో కొన‌సాగూత‌నే ఉన్నాయి. దీంతో ష‌మీకి మాజీ క్రికెట‌ర్ల నుంచి మంచి మ‌ద్ద‌తు ల‌భిస్తోంది.  

 మహ్మద్ షమీ భార్య హసిన్ జహాన్‌పై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మపై ఎక్కువగా ట్రోల్ చేస్తున్నారు. జంతువుల గురించి చింతించ‌డం మానేయండి, మీ భ‌ర్త‌ను జాగ్ర‌త్త‌గా చూసుకోండి అంటూ అనుష్య‌కు విప‌రీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. భార‌త జ‌ట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ పేల‌వ‌మైన ప్ర‌ద‌ర్శన చేసిన‌ప్పుడ‌ల్లా అభిమానులు అత‌ని భార్య అనుష్క శ‌ర్మ‌ను ట్రోల్స్ చేస్తూ.. ఉంటారు.  అయితే మొన్న జ‌రిగిన ప్ర‌పంచ‌క‌ప్ మ్యాచ్ లో భార‌త్ ఓడిపోవ‌డంతో విరాట్ కోహ్లితో పాటు ఆయ‌న భార్యను ట్రోల్స్ చేస్తున్నారు. మ్యాచ్ ముగిసి రెండు గ‌డిచినా.. ట్రోల్స్ మాత్రం ఆగ‌డం లేదు. ఓట‌మికి అనుష్క శ‌ర్మ‌నే కార‌ణ‌మ‌ని ప‌లువురు ఆరోపిస్తున్నారు. క‌ర్వా చౌత్ ఉప‌వాసం చేయ‌లేదా అని ప‌లువురు యూజ‌ర్లు అనుష్క‌కు ప్ర‌శ్న‌లు విసిరారు.

అనుష్క మీ భ‌ర్త విరాట్ కోహ్లిని జాగ్ర‌త్త‌గా చూసుకోండి. జంతువుల గురించి చింతించ‌డం కాస్త మానేయండి అని ఓ యూజ‌ర్ కామెంట్ చేశాడు. న‌వంబ‌ర్ 2015లో అనుష్క పోస్ట్ చేసిన ఫోటోతో ఈ ట్వీట్ చేశాడు. అప్పుడు దీపావ‌ళి పండుగ సంద‌ర్భంగా ట‌పాకాయ‌లు కాల్చ‌డానికి గుర్రాన్ని చూపిస్తూ  జంతువులు త‌ట్టుకోలేవ‌ని అనుష్క ఆందోళ‌న చేసింది. మ‌రొక యూజ‌ర్ ఈసారి క‌ర్వా చౌత్ ఉప‌వాసం పాటించ‌లేదా అని కామెంట్ చేశారు. 2014లో ఇంగ్లండ్ ప‌ర్య‌ట‌న‌లో విరాట్‌కోహ్లి పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌ర‌చ‌డంతో అనుష్క‌ను విప‌రీతంగా ట్రోల్స్ చేశారు. దీనిపై స్వ‌యంగా విరాట్ కోహ్లీనే స్వ‌యంగా ట్రోల్స్ ఆపాల‌ని సోష‌ల్ మీడియాలో కోరాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: