పదహారేళ్ల ఐపీఎల్ సీజన్లో మోస్ట్ అన్ లక్కీ టీం గా కొనసాగుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఇక 2024 ఐపీఎల్ సీజన్లో ఎప్పటిలాగానే టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగింది. అయితే అద్భుతమైన ప్రదర్శన చేసి ఆకట్టుకుంటుందని అందరూ ఊహించారు. కానీ వరుసగా ఓటములతో అభిమానులందరినీ కూడా నిరాశపరిచింది. టైటిల్ గెలవడం కాదు కనీసం ప్లే ఆఫ్ లో అయినా అడుగుపెడుతుందా లేదా అనే విషయంపై అనుమానపడ్డారు.


 కానీ ఊహించని రీతిలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు అటు ప్లే ఆఫ్ లో అడుగు పెట్టింది అన్న విషయం తెలిసిందే. సెకండ్ హాఫ్ లో వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో పైపైకి దూసుకు వచ్చిన బెంగళూరు.. ప్లే ఆఫ్ లో అడుగు పెట్టాలి అంటే చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్లో.. కూడా చెన్నై సూపర్ కింగ్స్ పై విజయం సాధించింది. ఈ క్రమంలోనే ఇక ఆ జట్టు అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి అని చెప్పాలి. అయితే ఈ సీజన్ మొత్తంలో అటు బెంగళూరు టీం గెలుపు ఓటములతో సంబంధం లేకుండా విరాట్ కోహ్లీ మాత్రం.. తన బ్యాటింగ్ తో మంచి ప్రదర్శన చేస్తూ వస్తున్నాడు.


 ఈ క్రమంలోనే ఎన్నో రికార్డులు కూడా కొల్లగోడుతున్నాడు. అయితే ఇటీవల మరోసారి అరుదైన రికార్డు సృష్టించాడు కోహ్లీ. ఐపీఎల్లో ఒకే వేదికలో 3000 ప్లస్ పరుగులు చేసిన తొలి ప్లేయర్గా నిలిచాడు విరాట్ కోహ్లీ. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఇవాల్టి మ్యాచ్ తో ఈ ఘనతను అందుకున్నాడు. మొత్తంగా 3005 పరుగులు చేశాడు. ఆ తర్వాత స్థానంలో రోహిత్ శర్మ వాంకడే  స్టేడియంలో 2995 పరుగులు, దివిలియర్స్ చిన్నస్వామి స్టేడియంలో 1960 పరుగులతో ఓకే స్టేడియంలో ఎక్కువ పరుగులు చేసిన ప్లేయర్లుగా ఉన్నారు. ఆర్ సి బి ప్లే ఆఫ్ కి అడుగుపెట్టిన నేపథ్యంలో ఇక ఈసారి బెంగళూరు జట్టుదే ఐపీఎల్ టైటిల్ అంటూ అభిమానులు బలంగా నమ్ముతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: