తాజాగా  గూగుల్ పేకు పోటీగా ఇప్పుడు జనాలందరికి పరిచయమైన ఫుల్ ఫేమస్ సోషల్ మీడియా యాప్ ‘వాట్సాప్’ వినియోగదారులకు ఒక శుభవార్తను అందించింది. త్వరలోనే వాట్సాప్ కూడా పేమెంట్స్ రంగంలోకి దిగుతోంది. గూగుల్ పే డైరెక్ట్ గా మన బ్యాంక్ అకౌంట్ నుంచే డబ్బులు కట్ అయ్యేలా అత్యంత ఖచ్చితత్వంతో పనిచేస్తుంది. ఈ యాప్ బాగా హిట్ అయ్యింది. ఇక వేరే ఇతర వాలెట్ ఆధారిత పేమెంట్స్ యాప్స్ ఈ గూగుల్ పే ముందు కొట్టుకుపోయాయి.


అయితే దీన్ని ఢీ కొడుతూ డిజిటల్ పేమెంట్ యాప్‌లు గూగుల్ పే, ఫోన్‌లకు గట్టి పోటీ ఇచ్చేందుకు వాట్సాప్ సిద్ధమైంది. ఈ ఫీచర్‌ను పూర్తిస్థాయిలో పరీక్షించిన తర్వాత ‘వాట్సాప్ పేమెంట్స్’ను లాంచ్ చేయాలని వాట్సాప్ గ్లోబల్ హెడ్ విల్ కాథ్ కార్ట్ నిర్ణయించారు. ప్రస్తుతం  ఈ యాప్‌ బీటా వెర్షన్‌ను ఇండియాలో పది లక్షల మంది యూజర్లతో ఫేస్‌బుక్ పరీక్షిస్తోంది. దీన్ని ప్రారంభించ‌డానికి ముందు భారత రిజర్వ్ బ్యాంక్ అనుమతులు తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది.


డిజిటల్ ప్లాట్‌ఫాం ద్వారా నగదు బదిలీని మరింత సులభతరం చేయడమే ల‌క్ష్యంగా వాట్సాప్ యాప్ రెడీ అవుతోంది. ఈ క్ర‌మంలోనే దేశంలోని బ్యాంకులతో ఒప్పందాలు చేసుకుంటున్న‌ట్టు కార్డ్ తెలిపారు. గూగుల్ పే కంటే సులభంగా డబ్బులు పంపేలా వాట్సాప్ తీర్చిదిద్దుతోంది. వాట్సాప్‌కు దేశంలో 400 మిలియన్ల మంది.. ప్రపంచవ్యాప్తంగా 1.5 బిలియన్ల యూజర్లు ఉన్నారు. ఈ యాప్ కనుక అందుబాటులోకి వస్తే నగదు బదిలీ మరింత సులభం కానుంది. అందుకే వీలైనంత త్వరగా దీన్ని అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: