ఖర్చు లేకుండా సింపుల్ గా సెక్యూరిటీ కెమెరా గా సెటప్ చేసుకోవచ్చు. అందుకోసం మనం ఎటువంటి ఖర్చు చేయవలసిన పనిలేదు. కేవలం మన ఇంట్లో ఉండే పాత స్మార్ట్ ఫోన్ను ఉపయోగించి మనం ఇలా చేసుకోవచ్చు. మన ఇంట్లో ఉండే పాత మొబైల్ మీ ఇంటికి సెక్యూరిటీ కెమెరాగా ఉపయోగించుకోవచ్చు. ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం.

మొబైల్లో సెక్యూరిటీ కెమెరా యాప్ ని ఎంచుకోవాలి.. ఇలాంటి సౌకర్యంతో చాలా యాప్స్ గూగుల్ ప్లే స్టోర్లో లభిస్తాయి. మనం లోకల్ స్ట్రిమింగ్ ,క్లౌడ్ స్ట్రిమింగ్ రికార్డింగ్ పొందినట్లే ఫుటేజ్ ని రిమోట్లు లేదా స్థానికంగా స్టోరేజ్ చేసే సదుపాయం కూడా ఇందులో కలదు. అయితే ఈ సెక్యూరిటీ కెమెరాను ఎక్కడి నుంచైనా నియంత్రించవచ్చు. alfred యాప్ ఉపయోగించి సెక్యూరిటీ కెమెరా ఉపయోగించుకోవచ్చు. ప్లే స్టోర్లో 4.7 రేటింగ్ మరియు 10 ఎంబి పైగా డౌన్లోడ్ ఉన్న యాప్ లనే ఉపయోగించుకోవాలి. అయితే ఆ తర్వాత మనం ఏం చేయాలి అనే విషయానికి వస్తే..


ఆండ్రాయిడ్ మొబైల్ లేదా ఐఓఎస్ స్టోర్ కి వెళ్లి alfred యాప్ ని కొత్త మరియు పాత మొబైల్స్ లో డౌన్లోడ్ చేయాలి. మీ కొత్త మరియు పాత మొబైల్ లో కూడా డౌన్లోడ్ చేసిన తర్వాత మీరు స్టార్ట్ బటాన్ని క్లిక్ చేయవలసి ఉంటుంది. అప్పుడు మీరు ఫ్యూయర్ పొందుతారు. దాన్ని ఎంచుకొని ముందుకు సాగాలి ఇక అక్కడక్కడ సైనింగ్ చేయవలసి ఉంటుంది. మీరు మీ గూగుల్ ఖాతాలో సైనిన్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ గూగుల్ ఖాతా కూడా అవసరం పడుతుంది. అలాగే పాత మొబైల్ లో కూడా ఇలాంటివి చేయవలసి ఉంటుంది. ఇలా అంతా చేసిన తర్వాత రెండు మొబైల్ లో ఓకే ఖాతాను సెట్ చేసుకోవాలి. ఆ తర్వాత మొబైల్ సెక్యూరిటీ కెమెరాగా పనిచేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: