సిటిజెన్ కంపెనీ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తో కూడిన  కొత్త సీజెడ్ స్మార్ట్ వాచ్ ను లాంచ్ చేసింది. దీనిలో ఏకంగా అమెరికాకు చెందిన స్పేస్ ఏజెన్సీ నాసా అందించిన టెక్నాలజీ కూడా ఉంది. దీని ద్వారా మనిషి అలసటను ఇంకా చురుకుదనాన్ని ఈజీగా గుర్తించవచ్చట. లాస్ వేగాస్ లో జరుగుతున్న కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో(సీఈఎస్)లో ఈ వాచ్ ను ఆ కంపెనీ ప్రదర్శించడం జరిగింది. ఈ వాచ్ పూర్తి వివరాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..ఈ సీజెడ్ స్మార్ట్ యూక్యూ వాచ్ ఈ సంవత్సరం మార్చి నుంచి అమెరికా మార్కెట్ లో అందుబాటులోకి రానుంది. దీని ప్రారంభ ధర వచ్చేసి 350 డాలర్లు ఉంటుంది.ఇక ఈ స్మార్ట్ వాచ్ లోని స్మార్ట్ యూక్యూ అప్లికేషన్ తో డాన్ని ధరించిన వ్యక్తికి తన ఆరోగ్యంపై సమాచారం ఇచ్చేందుకు ప్రత్యేక అలర్ట్ మోనిటర్ కూడా ఉంటుంది. ఇది ప్రతి రోజూ ఆ వ్యక్తి ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసి అతనికి పలు రకాల సూచనలు అందిస్తుంది.


ఇక ఈ వ్యవస్థ అనేది వ్యోమగాముల మానసిక స్థితిని తెలుసుకునేందుకు నాసా వినియోగించే సైకోమోటార్ విజిలన్స్ టాస్క్ టెస్ట్((PVT+) సంబంధించిన మోడల్.సిటిజెన్ కంపెనీ లాంచ్ చేసిన ఈ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తో కూడిన స్మార్ట్ వాచ్ లో సీజెడ్ స్మార్ట్ యూక్యూ(CZ Smart You Q) అప్లికేషన్ ను ఇన్స్టాల్ చేశారు. ఈ వాచ్ కి సామర్థ్యం అంతా కూడా ఈ అప్లికేషన్ మీద ఆధారపడి ఉంది. దీనిని చేతికి ధరించిన వ్యక్తి ఆరోగ్య పరిస్థితిని ఈ వాచ్ గుర్తిస్తుంది. ఇక ఆ వ్యక్తి అప్రమత్తత స్థాయి ఎలా ఉంది. అతను అలసిపోయడా.. లేక యాక్టివ్ గా ఉన్నాడా అన్న అంశాలను ఈ వాచ్ తెలియపరుస్తుంది.ఒకవేళ అలసిపోయి ఉంటే తిరిగి ఎనర్జీని గేయిన్ చేసుకోమని కూడా ఇది అలర్ట్ చేస్తుంది.ఇంకా అలాగే సూచనలు, సలహాలు కూడా అందిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: