కరోనా వచ్చిన తర్వాత చాలా మంది తమ ఆరోగ్యం విషయంలో  ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఇప్పుడున్న విపత్కర పరిస్థితులలో ఏ చిన్న సమస్య వచ్చినా సరే, ఆస్పత్రికి పరిగెత్తాల్సిన సమయం ఏర్పడింది కాబట్టి. ఇక ముఖ్యంగా ఎవరైనా సరే ఆక్సిజన్ లెవెల్ చెక్ చేయించుకోవాలి అనుకున్నా, బీపీని కొలవాలన్నా, గుండె స్పందన రేటు ను తెలుసుకోవాలన్నా, ఇలా ప్రతి చిన్న ప్రాథమిక పరీక్ష కు హాస్పిటల్ కు వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇక అంతే కాకుండా హాస్పిటల్స్ కు వెళ్లి సమయం వృధా చేసుకుంటూ, గంటల తరబడి క్యూలో నిల్చోవాలి అవసరం కూడా ఏర్పడింది. అయితే ఇప్పుడు అందరికీ స్మార్ట్ వాచ్ లు అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలామంది ఆసుపత్రులకు వెళ్లాల్సిన అవసరం కొంతమేరా తగ్గింది. కానీ ఇవి ఎంతవరకు ఖచ్చితమైన ఆరోగ్య విలువలను అంచనా వేస్తున్నాయి అనే ప్రశ్నలు చాలా మందిలో ఎదురయ్యాయి.


ఇక ఇలాంటి ప్రశ్నలకు, సమాధానంగా  ఇటీవల జరిగిన ఒక అధ్యయనంలో అంతర్లీన ఆరోగ్యాన్ని అంచనా వేయడానికి ఈ స్మార్ట్ వాచ్ లో వెలువడే ఫలితాలను ఉపయోగించవచ్చని  ఆ అధ్యయనం వెల్లడించింది. ఇటీవల ఆపిల్  అలాగే సాంసంగ్ సంస్థలు హృదయ స్పందన రేటు తో పాటు శారీరక శ్రమ వంటి ప్రాథమిక ఆరోగ్య డేటాను కొలవడానికి స్మార్ట్ వాచ్ లను అందుబాటులోకి తీసుకువచ్చాయి. అయితే ఇటీవల స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం చేసిన అధ్యయనం ప్రకారం ఎర్ర రక్త కణాలలో మార్పు, నిర్జలీకరణం యొక్క ప్రారంభ సంకేతాలు లతోపాటు రక్తహీనత కారణంగా జరిగే శారీరక మార్పులు, హృదయ స్పందన రేటు తెలుసుకోవడానికి ఈ స్మార్ట్ వాచ్ ను ఉపయోగించి, వీటి ద్వారా వచ్చే డేటాను తెలుసుకోవచ్చని విశ్వవిద్యాలయం తమ అధ్యయనంలో వెల్లడించింది. ఇక ఈ అధ్యయనంలో  54 మందిలో ఇతర ముఖ్యమైన పరీక్షలు చేసి, డేటాను ఈ స్మార్ట్ వాచ్ ల ద్వారా పరిశోధకుల బృందం ట్రాక్ చేసింది. ఇక ఇందులో కచ్చితమైన విలువలు వెలువడినట్లు ఆ బృందం తెలిపింది.

అంతేకాకుండా ఈ స్మార్ట్ వాచ్ లో వెలువడిన డేటా ప్రయోగశాలలో తీసుకున్న దానికంటే ఎక్కువ స్థిరమైన స్పందన రీడింగులను ఇచ్చింది. ఇక దీనిని చేతికి ధరించినప్పుడు అందులో వుండే సెన్సార్లు మన శరీరంలో ఉండే ప్రాథమిక ఆరోగ్యాన్ని అంచనా వేస్తాయని  అధ్యయనం  బృందం తెలిపింది. ఇక అంతే కాకుండా సాధారణంగా హృదయ స్పందన రేటు అలాగే ఎర్ర రక్త కణాల వృద్ధి,హిమోగ్లోబిన్లో మార్పులు తరచుగా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ స్మార్ట్ వాచ్ లు ఇచ్చే ఫలితాలు కూడా కచ్చితంగా ఉన్నాయని అధ్యయనం నిరూపించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: