పెళ్ళి లో ఒకప్పుడు పెళ్ళి కూతుర్లు సిగ్గుపడేవాళ్ళు.. కానీ, ఇప్పుడు పెళ్ళి అనగానే సంబరాలు జరుపుకుంటున్నారు. చాలా సంతోషంగా డ్యాన్స్ లు వేస్తూ, ఎంజాయ్ చేస్తున్నారు. అవికాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూన్నాయి.. ఇప్పుడు ఒక వింత ఎదురైంది.. మండపం పై పెళ్ళి కూతురు పెళ్ళి కోడుకుకు కోపం తెప్పించిందని వెంటనే విడాకులు ఇచ్చిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇది ఇప్పుడు హల్ చల్ చేస్తోంది.


ఒక పెండ్లి వేడుకలో రెచ్చగొట్టేలా వధువు పాట పాడటం తో పాటు డ్యాన్స్‌ కూడా చేసింది. దీనిపై ఆగ్రహించిన వరుడు అక్కడికక్కడే విడాకులు ఇచ్చాడు వరుడు. అంతా ఆశ్చర్యపోయే ఘటన ఇరాన్ లో వెలుగు చూసింది. ఆ దేశ రాజధాని బాగ్దాద్‌ లో ఇటీవల ఒక పెండ్లి వేడుక జరిగింది. ఈ సందర్భంగా సిరియా గాయకురాలు లామిస్ కాన్ సాంగ్‌ ‘మెసయతారా’ను వధువు తరుఫు వారు ప్లే చేశారు. ‘నేను ఆధిపత్యం చెలాయిస్తా.., నేను నిన్ను నియంత్రిస్తాను’ అనే రెచ్చగొట్టే విధంగా ఉన్న ఈ పాట కు వధువు డ్యాన్స్‌ కూడా చేసింది.


వరుడు కుటుంబాన్ని రెచ్చగొట్టేలా వధువు డ్యాన్స్ కూడా చేసింది. పాటకు వధువు డ్యాన్స్‌ చేయడం వల్ల తమ మనోభావాలు దెబ్బతిన్నాయని వరుడి కుటుంబం తెలిపింది. వరుడి కుటుంబం దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ, వాగ్వాదానికి ఇది దారి తీసింది. చివరకు వరుడు పెండ్లి వేదిక పైనే వివాహాని కి ముగింపు పలికాడు. అక్కడికక్కడే నవ వధువు కు విడాకులు ఇచ్చాడు. మరో వైపు ఇరాక్‌ లో అత్యంత వేగంగా విడాకులకు దారి తీసిన ఘటన గా ఈ పెళ్ళి రికార్డుకు ఎక్కింది.. ఇందుకు సంబంధించిన వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.. రక రకాల కామెంట్ల ను అందుకుంటుంది.




మరింత సమాచారం తెలుసుకోండి: