దసరా పండుగ వచ్చిందంటే చాలు దేశవ్యాప్తంగా ఉండే సందడి అంతా ఇంతా కాదు. హిందువులందరూ కూడా దసరాకు కొన్ని రోజుల ముందు నుంచే ఎంతో ఘనంగా సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటారు అని చెప్పాలి. ఇక దసరా రోజున రావణ దహనాన్ని దేశమంతా నిర్వహించుకుంటూ ఉంటారు. ఇలా చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా  రావణ దహనాలు చేస్తూ ఉంటారు అని చెప్పాలి. భారీ రావణ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఇక ఆ విగ్రహ దహనం చేస్తూ ఉంటారు. అయితే కొన్ని కొన్ని సార్లు ఈ రావణ దహన కార్యక్రమం లో అపశృతులు చోటు చేసుకోవడం లాంటివి కూడా జరుగుతూ ఉంటుంది.


 ఇక్కడ ఇలాంటిదే జరిగింది అని చెప్పాలి. ఉత్తరప్రదేశ్ లోని ముజుఫర్ నగర్లో రావణ దహన కార్యక్రమం వేడుక కాస్త చివరికి రివర్స్ అయింది. ఇక ప్రతి ఏడు లాగానే ఈ ఏడు కూడా రావణుడి భారీ దిష్టిబొమ్మను ఏర్పాటు చేశారు. ఇక ఆ విగ్రహానికి ఎంతో దూరంలో నిలబడి రావణ దహన కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారు అక్కడున్న ప్రజలు. ఇలాంటి సమయంలోనే ఇక రావణుడి భారీ దిష్టిబొమ్మకు నిప్పు అంటించిన సమయంలో ఇక రావణుడు రివర్స్ లో రాకెట్లను ఫైర్ చేశాడు. ముజఫర్  నగర్ లోని గవర్నర్ కాలేజీ గ్రౌండ్లో జరిగిన ఈ వేడుకలో ఇలాంటి ఘటన జరిగింది.



 ఈ క్రమంలోని రావణ దహనాన్ని చూసేందుకు వచ్చిన జనం పై ఆ రావణాసురుడు నుంచి రాకెట్లు ఎగసిపడ్డాయి అని చెప్పాలి. దీంతో జనం అక్కడి నుంచి ఒక్కసారిగా భయంతో పరుగులు పెట్టారు. ఇక అందరికీ భద్రత కల్పించేందుకు వచ్చిన పోలీసులు సైతం రావణాసురుడు దగ్గర నుంచి దూసుకు వస్తున్న రాకెట్ల నుంచి తప్పించుకునేందుకు పరుగులు పెట్టడం గమనార్హం. ఇక దీనికి తోడు బానసంచా కాల్చడం ముగిసిన తర్వాత ఒక దున్నపోతు జనంలోకి దూసుకు వచ్చి హంగామా సృష్టించింది అని చెప్పాలి. ఇక ఈ ఘటనలతో అక్కడున్న ప్రజలందరూ కూడా ఒక్కసారిగా ఆడలిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ట్విట్టర్ లో తెగ చక్కర్లు కొడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: