ఇటీవల కాలంలో లిఫ్ట్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగంగా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. ఒకప్పుడు ఏదైనా భవనం మీదికి వెళ్లాలన్నా లేదా ఆఫీసులోకి వెళ్లాలన్న మెట్లు ఎక్కడానికి అందరూ ఇష్టపడేవారు. కానీ ఇటీవల కాలంలో మాత్రం అందరూ కూడా మెట్లు ఎక్కడానికి కాదు ఏకంగా లిఫ్ట్ లో వెళ్లడానికి ఆసక్తి చూపిస్తున్నారు. యువకుల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా అందరూ లిఫ్టు ప్రయాణాలపై మొగ్గు చూపుతున్నారు అని చెప్పాలి. ముఖ్యంగా ఇటీవలే కాలంలో అయితే ఎక్కడ చూసిన పెద్ద పెద్ద భవనాలు నిర్మిస్తూ ఉన్న నేపథ్యంలో  ఇక ప్రతి భవనంలో లిఫ్ట్ అనేది తప్పనిసరిగా మారిపోయింది అని చెప్పాలి.


 ఇలా ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరి జీవితంలో లిఫ్ట్ అనేది ఒక భాగంగా మారిపోయింది అని చెప్పాలి. కొన్ని కొన్ని సార్లు సాంకేతిక సమస్యలు తలెత్తినప్పుడు లిఫ్టు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అయితే పోకిరి సినిమాలో ఇలియానా మహేష్ బాబు లిఫ్టులో ఉన్న సమయంలో లిఫ్ట్ ప్రమాదం జరిగినట్లుగా పరిస్థితి అసలు ఉండదు. లిఫ్ట్ ప్రమాదం జరిగితే చివరికి ప్రాణాల మీదికి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఇటీవల ఒక లిఫ్టు ప్రమాదానికి సంబంధించిన వీడియో కాస్త ట్విట్టర్ వేదికగా  చక్కర్లు కొడుతుంది అని చెప్పాలి. ఈ వీడియో చూస్తే మాత్రం మరోసారి లిఫ్ట్ ఎక్కడానికి కూడా భయపడిపోతారు అందరూ.



 ఇంతకీ ఈ వీడియోలో ఏముంది అంటే ప్రమాదం ఆసుపత్రిలో జరిగింది అన్నది తెలుస్తుంది. అయితే ఒక రోగిని స్ట్రచర్ పై పడుకోబెట్టుకుని ఇద్దరు అటెండెన్స్ లిఫ్టులో వేరే ఫ్లోర్ కి తీసుకువెళ్లడానికి వెళ్తూ ఉంటారు.. ఈ క్రమంలోనే ఒక వ్యక్తి ముందుగా లిఫ్టు లోపలికి వెళ్లి రోగి ఉన్న స్ట్రచర్ ను లోపలికి లాగుతూ ఉంటాడు. అంతలోనే లిఫ్ట్ కదిలి కిందకి వెళ్తుంది. తద్వారా ఇక ఆ స్ట్రచర్ పై ఉన్న రోగి లోపల ఉన్న అటెండెంట్ పై పడిపోతాడు. అయితే లిఫ్టులో ఒక్కసారిగా సాంకేతిక లోపం ఏర్పడటంతో అక్కడున్న  వారందరూ కూడా లిఫ్ట్ ఆటోమెటిగ్గా కిందికి వెళ్లిపోవడం పై షాక్ అయ్యారు.. ఇక ఈ వీడియో వైరల్ గా మారగా.. ఇది చూసిన ఎంతోమంది లిఫ్ట్ ఎక్కడానికి కూడా భయపడుతున్న పరిస్థితి ఏర్పడింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: