మాములుగా ఏ వాహనంకి అయినా లిమిటెడ్ సీట్స్ ఫిక్స్ అయి ఉంటాయి. సైకిల్ అయితే నడిపే వ్యక్తి కాకుండా  మరొ ఇద్దరు, ద్విచక్రవాహనం అయితే నడిపే వ్యక్తితో పాటు మరొకరు.. కారు అయితే దాని సీటింగ్ సామర్థ్యంపై కెపాసిటీ ఆధారపడి ఉంటుంది. కాని తాజాగా నెట్టింట్లో వైరల్‌గా మారిన ఓ వీడియోలో అయితే ఏకంగా తొమ్మిది మంది పిల్లలను ఎక్కించుకుని ఓ వ్యక్తి సైకిల్ పై సవారీ చేశాడు. సైకిల్ నడిపై వ్యక్తితో కలిపి మొత్తం పది మంది సైకిలెక్కారు. అతను ఏకంగా 9మంది పిల్లలను ఎక్కించుకుని.. చాలా ఈజీగా సైకిల్ తొక్కుతూ ముందుకెళ్తున్నాడు. దీనిపై నెటిజన్లు ఎన్నో రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.ట్విట్టర్లో పోస్టు చేసిన ఈ వీడియోలో ఓ వ్యక్తి సైకిల్ తొక్కుతూ కనిపించి బాగా వైరల్ అవుతున్నాడు. అతను తొక్కుతున్న సైకిల్ వెనుక ఇద్దరు కూర్చుని ఉన్నారు. వాళ్లలో ఒకరి మీద.. మరో చిన్నారి నిలబడి ఉంది. కింద పడిపోకుండా.. ఆ చిన్న పాప అతని భుజాలను పట్టుకుంది. 


ఇక సైకిల్ ముందు భాగంలోని రాడ్ మీద మరో ఇద్దరు పిల్లలు కూర్చుని వున్నారు. అలాగే ఫ్రంట్ వీల్ మీద మరో చిన్నారి కూర్చుంది. మిగిలిన ఇద్దరు అయితే ఆ వ్యక్తి భుజాల మీద ఎక్కి కూర్చున్నారు. మొత్తం 10మంది ఆ సైకిల్ మీద ఉన్నారు. ఇది చాలా ఈజీ అన్నట్టుగా.. ఆ వ్యక్తి సైకిల్ నడపడటం చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.అయితే ఇది ఆఫ్రికా ప్రాంతంలో తీసినట్టు కనిపిస్తోంది. ఈ వీడియోను ఇప్పటికి 2లక్షల మందికి పైగా చూడగా , దీనికి 7500కు పైగా లైక్స్ వచ్చాయి.సైకిల్ పై 9మంది పిల్లలను ఎక్కించుకున్న వీడియో పై నెటిజన్లు ఎన్నో విధాలుగా స్పందిస్తున్నారు. కొంతమంది దీన్ని తప్పుబడుతుంటే మరికొంతమంది మాత్రం ఆ వ్యక్తికి సపోర్ట్ గా నిలుస్తున్నారు.ఇంకొంతమంది అయితే ఫన్నీగా సైకిల్, టైర్లు ఏ కంపెనీవో.. చూడటానికి చాలా ధృడంగా ఉన్నాయంటూ కామెంట్స్ పెడుతున్నారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూ చక్కర్లు కొడుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: