అడవుల్లో అతి భయంకరమైన జంతువులలో పులులు, సింహాలు మొదటి వరుసలో ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే ఇక ఈ క్రూరమైన రెండు జంతువులు కూడా ఆహారాన్ని సంపాదించుకునేందుకు ఎంతకైనా తెగిస్తూ ఉంటాయి. ఏకంగా ప్రాణాలకు తెగించి పెద్ద పెద్ద జంతువులను సైతం వేటాడేందుకు దూసుకుపోతూ ఉంటాయి అని చెప్పాలి. ఇక పులులు సింహాలు వేటాడటం ఎంత భయంకరంగా ఉంటుంది అన్నది ఇప్పటికే అందరికీ తెలిసే ఉంటుంది. కొంతమంది టూరిస్టులు నేరుగా వెళ్లి పులులు సింహాలు వేటాడటం చూస్తే మరి కొంతమంది ఇక సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయిన వీడియోలను చూసి ఆ విషయాన్ని తెలుసుకున్నారు.


 ఏది ఏమైనా ఇక ఈ రెండు జంతువులు వేటాడే తీరు మాత్రం వెన్నులో వణుకు పుట్టిస్తూ ఉంటుంది అని చెప్పాలి.  కొన్ని కొన్ని సార్లు ఇతర జంతువులపై దూసుకుపోయి పంజా విసిరి వేటాడుతూ ఉంటే... ఇక మరికొన్నిసార్లు ఎంతో చాకచక్యంగా ఒకచోట నక్కి ఉండి సమయం సందర్భం వచ్చినప్పుడు ఇతర జంతువులపై దాడి చేసి ప్రాణాలు తీసేస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ ఒక పులి ఒక మనిషిని వేటాడిన వీడియో కాస్త ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయింది. కేవలం రెప్పపాటు కాలంలోనే పులి ఏకంగా మహిళను నోట్లో పట్టుకుని అడవిలోకి పరిగెత్తింది.


 ఈ వీడియో చూసి నెటిజెన్స్ అందరు కూడా షాక్ అవుతున్నారు అని చెప్పాలి. ఇక ఒకసారి వైరల్ గా మారిపోయిన వీడియోలొ చూసుకుంటే.. ఒక కారు రోడ్డుపై ఆగింది. పక్కనే మరికొన్ని కార్లు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే ఏదో కారణంతో మహిళ డోర్ దిగి రోడ్డుపైకి వచ్చింది. దీంతో అప్పటి వరకు అక్కడే మాటు వేసి కూర్చున్న పెద్దపులి ఒక్కసారిగా వచ్చి మహిళపై పంజా విసిరింది. దీంతో మహిళ కింద పడగానే పట్టుకొని అడవిలోకి వెళ్ళింది. అయితే కార్లో ఉన్న వాళ్ళు అక్కడ ఏం జరుగుతుందో చూసి అర్థం చేసుకునే లోపే అంతా జరిగిపోయింది. రెప్పపాటు కాలంలో ఇలా జరగడంతో సదరు మహిళలు కాపాడేందుకు కూడా అవకాశం లేకుండా పోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: