సాధారణంగా చిన్నారులలో చాలా సృజనాత్మకత ఉంటుంది. పెద్దలు వాటిని గమనించి, ప్రోత్సహిస్తే వారు చాలా ఉత్సాహంగా ముందడుగు వేస్తారు. ముఖ్యంగా ఏదైనా కుటుంబంలో పుట్టిన వారిలో పెద్ద పిల్లలకు కాస్త బాధ్యతలు ఉంటాయి. ముఖ్యంగా తమ కంటే చిన్న పిల్లలను, అంటే తోబుట్టువులను బాగా ప్యాంపర్ చేస్తుంటారు. తల్లిదండ్రుల తర్వాత తామే పెద్ద అని, చిన్న వాళ్ల మీద ఒక్కోసారి ఆధిపత్యం చెలాయిస్తుంటారు. అయితే తమ తమ్ముళ్లు, చెల్లెళ్లను చాలా గారాబం చేసి, చిన్న వయసులోనే చాలా పెద్దరికం చూపిస్తారు. చాలా బాధ్యత వారిలో కనపడుతుంది. ఇదే తరహాలో ఓ చిన్నారి తన తమ్ముడితో కలిసి ఆటలు ఆడుకుంటూ ఓ మ్యాజిక్ ట్రిక్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఆ వీడియోలో ఆ చిన్నారి మ్యాజిక్ ట్రిక్ చేయడానికి రెడీ అవుతుంది. చాలా పెద్ద పెద్ద మెజీషియన్లు తమకున్న ప్రతిభతో స్టేజిల మీద ఎవరో ఒక మనిషిని మాయం చేయడం గమనిస్తుంటాం. ఇది చూసి అంతా ఆశ్చర్యపోతుంటారు. ఇదే తరహాలో ఆ వీడియోలో చిన్నారి తన తమ్ముడిని మాయం చేయాలని భావిస్తోంది. టవల్ అందరికీ కనిపించేలా ఊపుతుంది. ఆ చిన్నారి ముందు ఆమె తమ్ముడు నిలబడి ఉంటాడు. టవల్‌ను అటూఇటూ ఊపుతుంది. తీరా టవల్ తీసే సమయానికి ఆ బాలుడు మాయం అవ్వాలి. అక్కడే చిన్న తప్పు జరిగింది. ఆ బాలుడి మోకాళ్లపై కూర్చున్న విధంగా కాళ్లు కనిపిస్తాయి. దీంతో ఆ బాలిక తన తమ్ముడిని తన్నుతుంది. ఈ వీడియోను @Ananth_IRAS అనే ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయగా బాగా వైరల్ అవుతోంది. ఆ బాలిక బాగా ట్రిక్ ప్లే చేసిందని, అయితే పాపం చివర్లో చిన్న తప్పు జరిగిపోయిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా ఆ ట్రిక్ బాగుందని పేర్కొంటున్నారు. ఈ వీడియో నెటిజన్లకు నవ్వులు పూయిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: