ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో వధూవరులు ఇద్దరు కూడా తమ పెళ్లి మండపంలోకి డాన్సులు చేస్తూ ఎంట్రీ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో చాలానే ప్రత్యక్షమవుతూ ఉన్నాయి. ఇక తమకు ఇష్టమైన పాటలపై డాన్స్ లు చేస్తూ అదిరిపోయే స్టెప్పులు వేస్తూ ఇక పెళ్లికి వచ్చిన అతిధులు అందరిని కూడా తమ డాన్స్ లతో ఫిదా చేసేస్తూ ఉన్నారు. కేవలం పెళ్ళికొడుకు పెళ్ళికూతురు మాత్రమే కాదండోయ్.. ఇక పెళ్లికి వచ్చిన అతిథులు సైతం ఇలా డాన్స్ లతో ఎంజాయ్ చేయడం లాంటి వీడియోలు కూడా సోషల్ మీడియాలోకి వస్తూ ఉన్నాయి. ఇక్కడ ఒక చిన్నారి పెళ్లివేడుకలో అద్భుతమైన డాన్స్ చేసింది.
ఇందుకు సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయి అందరి దృష్టిని ఆకర్షిస్తుంది అని చెప్పాలి. హరియాన్వి సాంగ్ 52 గజ్ క ధమన్ సాంగ్ కి ఒక చిన్నారి మెస్మరైజింగ్ డాన్స్ పెర్ఫార్మెన్స్ చేసింది. అయితే డాన్స్ చేసేందుకు స్టేజి లాంటిది లేకపోయినా తాను ఉన్నచోటే ఇక ఆ చిన్నారి చేసిన డాన్స్ మాత్రం అందరిని ఆకట్టుకుంటుంది. అయితే ఈ వీడియోలో చూసిన నేటిజన్స్ ఆ చిన్నారి డాన్స్ చూసి ఫీదా అయిపోతున్నారు. అలాంటిది ఇక నేరుగా ఆ చిన్నారి డాన్స్ ను చూసిన అక్కడికి వచ్చిన అతిథులు కూడా ఫిదా అవ్వకుండా ఎలా ఉంటారు.