సాధారణంగా కాలేజీ డేస్ లో ప్రతి ఒక్కరికి ఒక చిన్న లవ్ స్టోరీ ఉంటుంది. అయితే ఈ లవ్ స్టోరీ జీవితాంతం మిగిలిపోయే ఒక తీపి జ్ఞాపకంగా కొనసాగుతూ ఉంటుంది. కాలేజీ అయిపోయి ఒక ఉద్యోగంలో చేరి ఇక ఎన్నో ఏళ్లు గడిచిపోయిన తర్వాత ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే.. ఈ క్లాస్ రూమ్ లవ్ స్టోరీ స్నేహితులతో పంచుకోవడానికి ఒక తీపి జ్ఞాపకంగా మిగిలిపోతూ ఉంటుంది అని చెప్పాలి. ఇక ఇలా క్లాస్ రూమ్ లో ఉన్న లవర్స్ ను చూస్తే వాళ్లు మిగతా వారితో పోల్చి చూస్తే వేరే లోకంలో బ్రతికేస్తూ ఉంటారు.


 ఒకవైపు బోర్డుపై పాటలు చెబుతూ ఉంటే మరోవైపు ఒకరిని ఒకరు చూసుకుంటూ లోలోపల తెగ నవ్వుకుంటూ లైన్ వేసుకుంటూ ఉంటారు. ఇక పక్కనున్న వారికి చూసేందుకు ఇది ఎంత చిరాకుగా అనిపించినప్పటికీ ఇక వేరే లోకంలో బ్రతుకుతున్న ఆ లవర్స్ కి మాత్రం ఇది ఎంతో సంతోషాన్ని ఇస్తూ ఉంటుంది అని చెప్పాలి. అయితే ఇలా కాలేజీ డేస్ లో మొదలైన ప్రేమలో ఎప్పుడైనా సరే అమ్మాయి అబ్బాయికి సేవలు చేయడం ఇప్పటివరకు చూసాము. ఇక ఇంట్లో ఇచ్చిన పాకెట్ మనీ మొత్తం దాచుకొని మరి ప్రియుడి అవసరాలను తీర్చుతూ ఉంటారు ఎంతోమంది అమ్మాయిలు. కానీ అబ్బాయి అమ్మాయికి సేవలు చేయడం మాత్రం ఇప్పటివరకు చూడలేదు.


 కానీ ఇక్కడ మాత్రం ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది. ఏకంగా క్లాస్ రూమ్ లోనే అమ్మాయి కాళ్లు పడుతున్నాడు ప్రియుడు. ఆ సమయంలో సదరు అమ్మాయి ప్రియుడుతో ఏదో చర్చిస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ఇంస్టాగ్రామ్  లో వైరల్ గా మారిపోయింది. అయితే ఇక ఇలా లవర్స్ ఇద్దరూ మాట్లాడుకుంటున్న సమయంలో క్లాసులో మిగతా స్టూడెంట్స్ అందరూ ఇక వీరిని పట్టించుకోకుండా.. వారి వారి పనుల్లో బిజీగానే ఉన్నారు. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్స్ వామ్మో అమర ప్రేమికుడు ఉన్నట్టున్నాడు ఏకంగా ప్రియురాలి కాళ్లు పడుతున్నాడు అంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: