శాండ్ విచ్ ల గురించి గ్రామీణ ప్రాంతాల్లోని వారికి సరిగా తెలిసిఉండకపోవచ్చు కానీ పట్టణాల్లో నివసించే ప్రతి ఒక్కరికీ శాండ్ విచ్ ల పేరు సుపరిచితమే. చాలా మంది ఈ శాండ్ విచ్ లను చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. అందుకే అనేక ప్రాంతాల్లో ఈ శాండ్ విచ్ లను పోటీ పడి మరీ వివిధ రకాల రూపాలు, టేస్టుల్లో వెరైటీగా తయారు చేస్తూ ఉంటారు. ఇలా ఓ రెస్టారెంట్ తయారు చేసి శాండ్ విచ్ కు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లభించింది. నమ్మేందుకు వింతగా ఉన్నా.. ఇది నిజం. ఇంతకీ అంతలా శాండ్ విచ్ ల తయారీకి పేరుగాంచిన రెస్టారెంట్ ఎక్కడుందంటే....

న్యూయార్క్ నగరంలో స్రెండిప్టీ3 అనే వింత పేరు గల రెస్టారెంట్ లో తయారు చేసిన శాండ్ విచ్ కు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లభించింది. కేవలం వరల్డ్ రికార్డు మాత్రమే కాకుండా ఇక్కడ తయారయ్యే వెరైటీ రుచికరమైన శాండ్ విచ్ లను తినేందుకు ఎక్కడెక్కడి నుంచో ప్రజలు వస్తుంటారు. దీంతో ఆ రెస్టారెంట్ పరిసరాలు ఎప్పుడూ రద్దీగా ఉంటాయి. కేవలం వాళ్ల దేశంలోనే కాకుండా ప్రపంచంలో ఎక్కడా దొరకని వెరైటీ శాండ్ విచ్ రకాలు ఈ రెస్టారెంట్ లో దొరుకుతాయి. అందుకే ఈ రెస్టారెంట్ శాండ్ విచ్ లకు అంతలా పేరుగాంచింది.

ఈ రెస్టారెంట్ లో తయారు చేసిన ఓ శాండ్ విచ్ ఏకంగా గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించింది. ఇంతకీ ఆ శాండ్ విచ్ ప్రత్యేకత ఏంటంటే... ప్రపంచంలో ఖరీదైన వెన్నను ఈ శాండ్ విచ్ చేసుందుకు వాడతారు. అంతే కాకుండా పైన కోటింగ్ గా గోల్డ్ ఫాయిల్ ను అలంకరిస్తారు. ఇలా తయారు చేసిన ఈ శాండ్ విచ్ ఖరీదు ఎంతో తెలిస్తే తప్పకుండా షాక్ అవుతారు. ఏకంగా పదహారు వేల రూపాయలు. ఈ శాండ్ విచ్ గిన్నిస్ రికార్డు సాదించడానికి రేటు కూడా ఓ కారణం. గడిచిన ఏడేళ్ల కాలంలో ఇంతలా ఖరీదైన శాండ్ విచ్ ను ఎవరూ తయారు చేయలేదని గిన్నిస్ బుక్ ప్రతినిధులు వరల్డ్ రికార్డుకు ఎంపిక చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: