
బాలీవుడ్ సినిమాలు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా బాలీవుడ్ సినిమాల్లో కథానాయికగా ఏ రేంజ్ లో పర్ఫామెన్స్ చూపించాలో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదేమో. ఎందుకంటే ఆ ఇండస్ట్రీలో హీరోయిన్లు నిర్మొహమాటంగా గ్లామర్ షోలు చేయడం.. ఎలాంటి అభ్యంతరాలు లేకుండా ముద్దు సీన్స్, పొట్టి పొట్టి డ్రెస్సులను వేసి షో చేస్తూ ఉంటారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో అలాంటి సీన్స్ కామనే. కాని మిగతా ఇండస్ట్రీ వర్గాలు బాలీవుడ్ కంటే కొంచెం వెనకబడి ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే బాలీవుడ్ ఇండస్ట్రీ ఆ రేంజ్ ఎలాంటి సీన్స్ నైనా అలా అలవోకగా చూపించేస్తూ ఉంటుంది. కాగా ఈ మధ్యన మిగతా ఇండస్ట్రీ వర్గాలు కూడా బాలీవుడ్ ట్రెండ్ నే ఫాలో అవుతున్నట్టు అనిపిస్తోంది. గ్లామర్ షో లు చేస్తూ మేమేం బాలీవుడ్ కంటే తక్కువ కాదన్నట్టు గ్లామర్ షో లను చూపించేస్తూ ఉన్నాయి. అందులో టాలీవుడ్ ఏమీ తక్కువ కాదు.

ఈ మూవీ ప్రముఖ డైరెక్టర్ వికాస్ బల్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్నది. ఈ మూవీకి డెడ్లీ అనే పేరును కూడా ఫిక్స్ చేశారట. అయితే ఈ సినిమా తండ్రీ కూతురు మధ్యన కథ తిరగనుందని వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఎమోషనల్ మూవీగా ఈ సినిమా తెరకెక్కబోతున్నట్టు తెలుస్తోంది. కాగా ఈ మూవీని రిలయన్స్ సంస్థ నిర్మించనున్నట్లుగా సమాచారం. అయితే 2021 మార్చి లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంపై ఎలాంటి అధికార ప్రకటన రాలేదు. కాని నెట్టింట్లో ఇదే గాసిప్ తెగ వైరల్ గా మారింది. ఏదేమైనా ఇదే కనక నిజమైతే రష్మిక పంట పండినట్టే. బాలీవుడ్ లోనూ అవకాశాలను అందిపుచ్చుకోవడం ఖాయమని ఆమె ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇంకేముంది తన హవాను రష్మిక బాలీవుడ్ లోనూ చాటుకోబోతోందని అర్థమవుతోంది.