గర్భధారణ సమయంలో గర్భిణులు చాలా జాగ్రత్తగా ఉండాలి.వాళ్ళు తీసుకొనే ఆహారాన్ని మీదే బిడ్డ ఎదుగుదల ఆధారపడుతుంది. అయితే గర్భధారణ సమయంలో పోషకాలు, విటమిన్లు మీకు మీ కడుపులోని బిడ్డకు చాలా అవసరం. మనకు అంతగా తెలియని కివి లాంటి పండ్లు, మీకు ప్రెగ్నన్సీ సమయంలో చాలా మేలు చేస్తాయి. అవి ఏంటో ఒక్కసారి చూద్దామా.

సాధారణంగా కివి ఫ్రూట్ లో ఫోలేట్ చాలా అధికంగా ఉంటుంది. ఫోలేట్ కణాల నిర్మాణానికి చాలా అవసరమైన పోషకం. మీ ప్రెగ్నన్సీ సమయంలో దీనిని తీసుకోవడం వలన కడుపులోని బిడ్డ అవయువ నిర్మాణానికి కావాల్సిన ఫోలేట్ ను అందిస్తుంది. పిల్లలకు పుట్టుక లోపాలు ఉండవు. కివి ఫ్రూట్స్ లో విటమిన్ సి 140 శాతం ఉంటుంది. ప్రెగ్నన్సీ సమయంలో మీకు మీ బిడ్డకు విటమిన్ ‘సి’ చాలా అవసరం. బిడ్డ మెదడు ఎదుగుదలకు కావాల్సిన న్యూరో ట్రాన్స్మిటర్స్ ను విటమిన్ ‘సి’ ఉత్పత్తి చేస్తుంది.

అయితే కివి సహజమైన చక్కెర్లు ఉంటాయి. ఇవి మీరు తీపి తీసుకోవాలన్న కోరికను తగ్గిస్తాయి. ప్రెగ్నన్సీ సమయంలో అధిక కృతిమ చక్కర తీసుకోవడం వలన ఇన్సులిన్ శాతం పెరుగుతుంది. అది మీకు బిడ్డకు మంచిది కాదు. అలా జరగకుండా మీకు కివి సహాయపడుతుంది. ప్రెగ్నన్సీ సమయంలో తీసుకున్న ఆహరం సరిగా అరగక, గ్యాస్ సమస్యతో ఇబ్బందిపడుతారు. ఇందుకు సరైన పరిష్కారం, కివి ఫ్రూట్ తినడం. ఇందులో పీచు పదార్ధాలు జీర్ణ శక్తిని పెంచి ఆహరం పూర్తిగా అరిగేలా చేస్తుంది. గ్యాస్ సమస్యలను తగ్గిస్తుంది.

ఇక కడుపులోని బిడ్డ RNA, dna లను రక్షించే యాంటిఆక్సిడెంట్స్ కివి లో ఉంటాయి. ఇవి మీ శరీరంలోని రోగ కారకాలతో పోరాడి, మిమ్మల్ని రోగాలనుండి కాపాడుతాయి. ప్రెగ్నన్సీ సమయంలో హార్మోన్లు అసమతుల్యంగా ఉంటాయి. ఒక సారి బాధగా వుంటారు, ఇంకొకసారి అంతులేని సంతోషంగా ఉంటారు. దీనికి కారణం హార్మోన్లు ఎక్కువ తక్కువ అవడం. కివి తినడం వలన ఈ సమస్య రాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: