గర్భధారణ సమయంలో మహిళ తనకు పుట్టబోయే పిల్లల గురించి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటుంది. పుట్టబోయే బిడ్డ తెల్లగా ఉండాలని పాలలో కుంకుమ పూవ్వు కలుపుకొని తాగుతుంది. అంతేకాదు.. ప్రతి తల్లీ తనకు తెలివైన పిల్లలు పుట్టాలని కలలు కంటూ ఉంటుంది. తల్లిగా ఆశపడటంలో ఎలాంటి తప్పు లేదనుకోండి. ఇక తెలివైన పిల్లలు పట్టాలంటే ప్రెగ్నెన్సీ సమయంలో ఖచ్చితంగా కొన్ని కొన్ని ఆహారాలను పాటించాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవి ఏంటో ఒక్కసారి చూద్దామా.

అయితే పిల్లలు తెలివితేటలతో పుట్టాలంటే.. గర్భిణీలు విటమిన్ డి పుష్కలంగా ఉండే ఆహారం ప్రతిరోజు తీసుకుంటూ ఉండాలి. ఇక ఉడికించిన గుడ్డు, చేపలు, మీట్‌, తృణధాన్యాలు, పాలకూర వంటి వాటిలో విటమిన్ డి సమృద్ధిగా లభిస్తుంది. అందుకే వాటిని డైట్ లో చేర్చుకోవాలని చెబుతున్నారు. అంతేకాక.. బాదం పప్పు, వాల్ నట్స్‌, పిస్తా పప్పు, జీడి పప్పు వంటి నట్స్ ను గర్భిణీలు తీసుకుంటూ ఉండాలి. కాగా.. నట్స్‌లో ఉండే విటమిన్స్, మినరల్స్‌, ప్రోటీన్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌, ఇతర పోషకాలు శిశువు మెదడు అభివృద్ధి చెందడానికి దోహదపడుతాయి. ఇక భవిష్యత్తులో పిల్లల తెలివితేటలకూ సహాయపడుతాయని చెబుతున్నారు.

ప్రెగ్నెన్సీ సమయంలో కడుపులోని శిశువు ఆరోగ్యం, మెదడు సక్రమంగా ఉండాలంటే ఫోలిక్ యాసిడ్ కూడా చాలా అవసరం. అందుకే గర్భధారణ సమయంలో క్యారెట్‌, బీట్‌రూట్‌, టమాటా, పప్పు ధాన్యాలు, కమలా పండ్లు, అరటి పండ్లు, వేరు శెనగలు, రొయ్యలు వంటివి తినడం వలన పుట్టబోయే బిడ్డ మంచి తెలివి తేటలతో పుడుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే తెలివైన పిల్లలు పుట్టాలంటే ఐరన్ కూడా అవసరమే. అందుకోసం దానిమ్మ రసం, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, బీన్స్, ఓట్స్‌ వంటివి తీసుకుంటూ ఉండాలి. ఆహారంతో పాటు ఒత్తిడికి దూరంగా ఉంటూ.. నీటిని ఎక్కువగా తాగుతూ ఉండాలి. ఇక అప్పుడప్పుడు మంచి సంగీతాన్ని వింటూ.. రెగ్యులర్ గా కొంత సమయం పాటు వాకింగ్ చేయాలని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: