భారత రాజకీయాల్లో అత్యంత ప్రభావం చూపించిన వారిలో జయలలిత చాలా కీలకం. తమిళనాడు ముఖ్యమంత్రి గా ఆమె దేశ రాజకీయాలను కూడా శాసించారు. ముఖ్యమంత్రిగా ఆమె ప్రభావం గురించి ఎంత చెప్పినా తక్కువే. సినిమాల్లో ఒక వెలుగు వెలిగిన ఆమె... ఆ తర్వాత రాజకీయాల్లో కూడా సత్తా చాటారు. తమిళనాడు లో అప్పటి వరకు పాతుకుపోయిన రాజకీయ దిగ్గజాలను సైతం ఆమె సమర్ధవంతంగా ఎదుర్కొన్నారు. ఎక్కడా కూడా భయపడకుండా ఆమె రాజకీయాల్లో రాణించారు. ఇక ఆమె సినిమాల్లో రాణించిన తీరు ఎంతో ఆసక్తికరంగా కూడా ఉంటుంది. 

 

ముందు ఆమె సినిమాల్లోకి అడుగు పెట్టడానికి గానూ ఆమె తల్లి అందించిన సహకారమే చాలా కీలకం అని అంటూ ఉంటారు. ఆమె తల్లి ముందు ఉండి నడిపించారు అని అంటారు. సినిమాల ఎంపిక నుంచి ఆస్తి వ్యవహారాల వరకు ఆమె అన్ని విధాలుగా సహాయం చేసారు అని అంటారు. తల్లి లేకపోయి ఉంటే జయలలిత ఈ స్థాయిలో పేరు తెచ్చుకుని ఉండే వారు కాదు అని అంటారు. తల్లి మానసికంగా కూడా జయ కు అండగా నిలబడ్డారు అని జయ తన తల్లి మరణ౦ తర్వాత చాలా ఒంటరి గా రోజులు నెట్టుకుని వచ్చారు అని అంటారు. 

 

తమిళ సినిమాల్లో ఆమె హవా కొనసాగడానికి తల్లికి ఉన్న పరిచయాలే కారణం అని ఆమె తల్లి లేకపోయి ఉంటే ఆమెకు అవకాశాలు ఎక్కువ గా వచ్చేవి కాదు అనేది కొందరి మాట. జయలలితకు తల్లి అన్నీ ఇచ్చారని, ఆస్తి నుంచి పేరు వరకు అన్నీ కూడా ఆమె నుంచి జయకు వచ్చాయని అంటారు. జయలలిత తల్లి లేని ఒంటరి తనం భరించలేక చాలా మందికి దగ్గరి మోసపోయారు అని కూడా ఉంటారు. శోభన్ బాబు విషయంలో ఇదే జరిగింది అని కొందరు అంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: