ఇక 'మహీంద్రా అండ్ మహీంద్రా' నిన్న స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒకటి, రెండు కాదు.. ఏకంగా 5 ఎలక్ట్రిక్ కార్లను భారతీయ మార్కెట్లో ఆవిష్కరించింది.ఇక అంతే కాకుండా.. ఇప్పటికే చాలా సంవత్సరాలుగా విడుదల చేయడానికి సన్నద్ధమవుతున్న 'ఎక్స్యూవీ400' (XUV400) కార్ ను మహీంద్రా ఓ కొలిక్కి తీసుకురావడానికి పూనుకుంది. ఇక దీని గురించి మరింత సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం..మహీంద్రా కంపెనీ అందించిన సమాచారం ప్రకారం తెలిసిన విషయం ఏమిటంటే తన XUV400 ఎలక్ట్రిక్ SUV 2022 సెప్టెంబర్‌లో ప్రారభించబడే అవకాశం ఉంది. ఇది భారతీయ మార్కెట్లో కంపెనీ మొట్ట మొదటి ఎలక్ట్రిక్ SUV కార్ కానుంది. నిజానికి ఇది 2020 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించబడింది. అయితే ఇకపై ఇది ప్రొడక్షన్ కి సిద్ధమవుతోంది. కాబట్టి ఇది భారతీయ రోడ్లమీద తిరగటానికి ఇక ఎన్నో రోజులు లేదని స్ఫష్టంగా తెలుస్తోంది.మహీంద్రా కంపెనీ ఇప్పటికే చాలా సార్లు తన కొత్త XUV400 ఎలక్ట్రిక్ SUV ని టెస్టింగ్ చేస్తూనే ఉంది..ఇది త్వరలోనే వినియోగంలోకి రావడానికి సిద్ధమవుతోంది.


2024 ఇంకా 2026 సంవత్సరాల్లో ఎలాంటి ఎలక్ట్రిక్ కార్లను ఆవిష్కరించాలి అనే ప్రణాలికను కంపెనీ ఇప్పటికే సిద్ధం చేసుకుంది.ఇక అటువంటి సమయంలో ఇది భారతీయ మార్కెట్లో విడుదలయ్యే మొదటి మహీంద్రా ఎలక్ట్రిక్ SUV కానుంది.XUV400 SUV  ప్రొడక్షన్ వెర్షన్‌ను 2022 ఆగస్టు 15 న విడుదల చేసే అవకాశం ఉందని భావించారు, కానీ ఇది సెప్టెంబర్ నెలలో విడుదల చేసే అవకాశం కూడా ఉంది. కానీ కంపెనీ దీని పైన ఎటువంటి సమాచారం అనేది అందించలేదు. అయితే దీని ఉత్పత్తి ఈ సంవత్సరం చివరి నాటికి ప్రారంభమయ్యే అవకాశం అనేది ఉంది, కావున 2023 ప్రారంభం నాటికి అధికారికంగా దేశీయ విఫణిలో ఈ కార్ విడుదలయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ధర మొదలైనవన్నీ కూడా అదే సమయంలో వెల్లడయ్యే అవకాశం ఉందని కూడా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: