భారత్ మార్కెట్ లో ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న హోండా సంస్ద నుండి త్వరలోనే మరో సరికొత్త కారు రానుంది. భారత్ లో హోండా సంస్ద అత్యుత్తమ విక్రయాలు అందుకుంటున్న సంగతి తెలిసిందే. జపాన్ కార్ల సంస్ద అయినా హోండా ఇప్పటికే ఎన్నో అద్భుతమైన వాహనాలను భారత్ లో విడుదల చేశారు. 

 

త్వరలో మరో సరికొత్త మోడల్ ను విడుదల చేయడానికి హోండా సిద్ధం అయ్యింది. తన డబ్ల్యూఆర్-వీ వాహనాన్ని వచ్చే నెలలో లాంచ్ చెయ్యాలి అని ప్రణాళికను సిద్ధం చేశారు. తాజాగా ఈ కారును లాంచ్ చేసిన హోండా ఈ కారును బీఎస్6 ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించిన ''డబ్ల్యూఆర్-వీ'' పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లతో ముందుకు రానుంది.

 

ఈ సరికొత్త కారు ధరను హోండా అధికారికంగా ప్రకటించలేదు కానీ ఈ కారు ధర 8.08 లక్షల నుండి 10.48 లక్షల రూపాయల మధ్య ఉండొచ్చని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. హోండా డబ్ల్యూఆర్-వీ మోడల్ ను బీఎస్6 కాలుష్య నియంత్రణ ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించారు. అయితే ఈ కారు 1.5 లీటర్ డీజిల్, 1.2 పెట్రోల్ ఇంజిన్లను కలిగి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: