టాటా మోటార్స్ ఇండియా మార్కెట్లో కొత్త సఫారీ గోల్డ్ ఎడిషన్‌ విడుదల చేయడం జరిగింది.ఇండియా మార్కెట్లో విడుదలైన సఫారీ గోల్డ్ ఎడిషన్ ప్రారంభ ధర వచ్చేసి రూ. 21.89 లక్షలు (ఎక్స్-షోరూమ్) వుంది. ఇక ఈ కొత్త స్పెషల్ ఎడిషన్ ఎస్యూవి మాన్యువల్ ఇంకా ఆటోమేటిక్ అనే రెండు వేరియంట్లలో మనకు అందుబాటులో ఉంటుంది. ఇక కంపెనీ కూడా బుకింగ్స్ ప్రారంభించడం జరిగింది.కాబట్టి కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు కంపెనీ తన అధికారిక వెబ్‌సైట్‌లో బుక్ చేసుకోవచ్చు. ఇక దీని డెలివరీలు కూడా త్వరలో ప్రారంభమవ్వడం జరుగుతుంది.ఇక ఇది వరకు చెప్పినట్లు కంపెనీ రెండు వేరియంట్లలో (మాన్యువల్ ఇంకా ఆటోమాటిక్) వేరియంట్లలో విడుదల చేయడం జరిగింది.ఇక Safari XZ+ gold (మాన్యువల్) ధర వచ్చేసి రూ. 21.89 లక్షలు ఉంటుంది.ఇంకా Safari XZA+ gold (ఆటోమేటిక్) ధర వచ్చేసి రూ. 23.17 లక్షలు ఉంటుంది.

టాటా మోటార్స్ కొత్త Safari gold Edition కార్ ను రెండు కలర్ ఆప్సన్స్ లో విడుదల చేయడం జరిగింది.అవి వైట్ గోల్డ్ ఇంకా బ్లాక్ గోల్డ్..వైట్ గోల్డ్ కలర్ స్కీమ్‌లో ప్రీమియం ఫ్రాస్ట్ వైట్ బాడీ పెయింట్ ఇంకా బ్లాక్ కాంట్రాస్టింగ్ రూఫ్ ని మనం గమనించవచ్చు. ఇక ఈ కార్ లోని గ్రిల్, హెడ్‌ల్యాంప్ సరౌండ్స్, రూఫ్ రైల్స్, డోర్ హ్యాండిల్స్, టాటా సఫారీ బ్యాడ్జ్‌లపై గోల్డ్ కలర్ యాక్సెంట్స్ అనేవి ఉన్నాయి. ఇవి చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి.ఇక ఇక బ్లాక్ గోల్డ్ కలర్ స్కీమ్ విషయానికి వస్తే, బయట వైపు మొత్తం కూడా కాఫీ బీన్ బ్లాక్ ఎక్స్‌టీరియర్‌ల ఈ కార్ అనేది కలిగి ఉంటుంది. ఈ కార్ లో కూడా గ్రిల్, హెడ్‌ల్యాంప్ సరౌండ్స్, రూఫ్ రైల్స్, డోర్ హ్యాండిల్స్, టాటా  సఫారీ బ్యాడ్జ్‌లపై గోల్డ్ కలర్ యాక్సెంట్స్ అనేవి ఉన్నాయి. ఇక ఇవి వినియోగదారులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: