కలకత్తా నైట్ రైడర్స్ బౌలర్ సునీల్ నారాయణ్ బౌలింగ్ శైలిపై విమర్శలు మరోసారి వచ్చాయి. పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో మంచి బౌలింగ్ తో జట్టుని విజయం దిశగా నడిపించాడు. 18 వ ఓవర్లో కేవలం రెండు పరుగులు మాత్రమే ఇచ్చాడు అతను. అయితే అతని బౌలింగ్ అనుమానాస్పదంగా ఉంది అని ఫీల్డ్ అంపైర్ లు ఫిర్యాదు చేసారు. అతని బౌలింగ్ నిబంధనలకు విరుద్దంగా ఉంటే మాత్రం అతన్ని బ్యాన్ చేసే అవకాశం ఉంది.

"ఐపిఎల్ అక్రమ బౌలింగ్ యాక్షన్ పాలసీ ప్రకారం ఆన్-ఫీల్డ్ అంపైర్లు ఈ నివేదికను రూపొందించారు. నరైన్ ప్రస్తుతం వార్నింగ్ పీరియడ్ లో ఉన్నాడు. అతను గనుక మళ్ళీ అదే బౌలింగ్ శైలితో బౌలింగ్ చేస్తే మాత్రం బ్యాన్ చేస్తామని  తర్వాతి  టోర్నీ ఆడటానికి వీలు లేదు అని ఐపిఎల్ ప్రకటన చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: