ప్రపంచంలో ప్రతి అంశానికి ఒక రోజు కేటాయిస్తూ ఉంటారు. ఎయిడ్స్ మొదలు యోగా దాకా ప్రతి అంశానికి ఏదో ఒక రోజును కేటాయిస్తూ ఉంటారు.. కానీ జూన్ 21వ తేదీ మాత్రం అలా మూడు అంశాలకు కేటాయించడం ఆసక్తికరంగా మారింది. అలాగే ఈ రోజు మరో అంశంలో కూడా ముందుంది. జూన్ 21వ తేదీన ఇప్పటికే ప్రపంచ యోగా దినోత్సవం జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. 

అయితే ఇదే రోజున ప్రపంచ వ్యాప్తంగా సెల్ఫీ దినోత్సవంగా కూడా జరుపుకుంటున్నారు. ఈ రెండే కాకుండా ఈ రోజు ప్రపంచ మ్యూజిక్ దినోత్సవం కూడా. అంతేకాక ఈ రోజు ఈ ఏడాది మొత్తంలో ఉన్న ఏకైక లాంగెస్ట్ డే.  అంటే ఈరోజు మిగతా రోజులకంటే ఉదయం సమయం ఎక్కువగా ఉంటుంది.. అలా మొత్తం మీద ఈ రోజు ఏకంగా నాలుగు విశేషాలకు నెలవుగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: