రాంచీ ఎక్స్ ప్రెస్ హైవే కేసులో ఖ‌మ్మం ఎంపీ నామా నాగేశ్వ‌ర‌రావు ఈడీ ఎదుట విచారణకు హాజ‌ర‌వ‌లేదు. స‌మ‌యం కావాలంటూ ఎంపీ కోర‌డంతో మ‌రోసారి స‌మ‌న్లు జారీచేయాల‌ని ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్ట‌రేట్ నిర్ణ‌యించింది. 1,064 కోట్ల రూపాయల బ్యాంక్ మోసం కేసుకు సంబంధించి ఎంపీ నామా, రాంచీ ఎక్స్‌ప్రెస్‌వే లిమిటెడ్ డైరెక్టర్ల నివాసాలు, కార్యాలయాల్లో గ‌త శుక్రవారం త‌నిఖీలు జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. మొత్తం హైద‌రాబాద్‌లో ఆరుచోట్ల ఈ సోదాలు కొన‌సాగాయి. రాంచీ-జంషెడ్‌పూర్ (ఎన్‌హెచ్ -33) ప్రాజెక్టులో అక్ర‌మాలు జరిగాయని ఆరోపిస్తూ రాంచీ ఎక్స్‌ప్రెస్‌వే లిమిటెడ్, మధుకాన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్, కెనరా బ్యాంక్ నేతృత్వంలోని కన్సార్టియం ఆఫ్ బ్యాంక్స్ అధికారులపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మార్చి 2019లో కేసు నమోదు చేసింది. 2012 డిసెంబరులో ప్రారంభమైన ఈ ప్రాజెక్టును పూర్తి చేయడంలో ఆలస్యం జరిగిందనే విష‌యంపై  దర్యాప్తు జరపాలని హైకోర్టు సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్‌ఎఫ్‌ఐఓ) ను ఆదేశించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

tag