దేశ వ్యాప్తంగా ప్రతిపక్షాలను ఏకతాటి మీదకు తీసుకురావడానికి కాంగ్రెస్ పార్టీ కాస్త ఎక్కువగా కష్టపడుతుంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ విపక్షాల నాయకులతో వరుస సమావేశాలు నిర్వహించేందుకు సిద్దమవుతున్నారు. దేశ వ్యాప్తంగా ఆర్ధిక పరిస్థితి అలాగే ఉత్తరాది రాష్ట్రాల కీలక ఎన్నికలతో పాటుగా సోషల్ మీడియా విషయంలో కేంద్రం అనుసరిస్తున్న తీరు ఇలా ప్రతీ ఒక్కటి కూడా ఇప్పుడు సీరియస్ గానే ముందుకు వెళ్తున్నారు.

ముఖ్యంగా మహారాష్ట్ర సిఎం ఉద్దావ్ థాకరే తో సోనియా గాంధీ సమావేశానికి ఆసక్తి చూపిస్తున్నారు. 20 వ తేదీన పలు విపక్ష పార్టీల నేతలతో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ సమావేశం నిర్వహిస్తారని కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించనున్నారు సోనియాగాంధీ. వీడియో సమావేశంలో వెస్ట్ బెంగాల్ సీఎం మమత బెనర్జీ, ఉద్ధవ్ ఠాక్రే, తమిళనాడు సీఎం స్టాలిన్, హేమంత్ సొరేన్, పలువురు ముఖ్య నేతలు పాల్గొనే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: