ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని కొవ్వూరు ఎమ్మెల్యే న‌ల్ల‌పురెడ్డి ప్ర‌స‌న్న‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నం సృష్టిస్తున్నాయి. తాజాగా ఆయ‌న మ‌హిళ‌ల‌పై  అఘాయిత్యాలకు పాల్ప‌డే వారిని కేవ‌లం శిక్షిస్తే మాత్రం అస‌లు స‌రిపోదు. న‌డిరోడ్డుపై నిల‌బెట్టి వారి మ‌ర్మాంగాలు కోసి, కాళ్లు చేతులు న‌రికేస్తే వారికి కాస్త భయానికి గుర‌వుతారు. మ‌ర‌ల ఇలాంటి అఘాయిత్యాల‌కు అస‌లు పాల్ప‌డ‌రు. మ‌న‌దేశంలో న్యాయ‌వ్య‌వ‌స్థ తీర్పు ఇవ్వ‌డానికి చాలా రోజులు స‌మ‌యం తీసుకుంటుంది. అందుకే ఇలాంటి ఘ‌ట‌న‌లు త‌రుచూ పున‌రావృతం అవుతున్నాయి.

మాన‌వ మృగాళ్ల‌ను ప‌క్క దేశాల్లో న‌డిరోడ్డుపై ఉరితీస్తార‌ని వెల్ల‌డించారు. మ‌న దేశంలో మాత్రం అలాంటి క‌ఠిన  చ‌ట్టాలు ఎందుకు తీసుకురార‌ని ప్ర‌శ్నించారు. కొన్ని దేశాల‌లో ఇలాంటి సంఘ‌ట‌న‌లు జ‌రిగితే వెంట‌నే తీర్పు వ‌స్తుంద‌ని తెలిపారు. భార‌త‌దేశంలో చ‌ట్టాల్లో మార్పు తీసుకురావాల‌ని సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి  జ‌స్టీస్ ఎన్వీ ర‌మ‌ణ‌కు లేఖ రాస్తాన‌ని వివ‌రించారు. మ‌హిళ‌ల అఘాయిత్యాలకు పాల్ప‌డిన వారిపై ప్ర‌త్యేకంగా ఎమ‌ర్జెన్సీ చ‌ట్టం రావాల‌ని..  అప్పుడే మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ ఉంటుంద‌ని చెప్పారు.
   

మరింత సమాచారం తెలుసుకోండి: