మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కొనసాగుతున్న సీబీఐ విచారణలో జరుగుతున్న కొన్ని పరిణామాలు హాట్ టాపిక్ గా మారాయనే చెప్పాలి. తాజాగా హైదరాబాద్ లో దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని అరెస్టు చేసిన సీబీఐ... అతన్ని కడప జిల్లాకు తరలించింది. వివేకానంద రెడ్డి హత్య కేసులు అప్రూవర్ గా మారిన డ్రైవర్ దస్తగిరి ఇచ్చిన సమాచారంతోనే అతన్ని అదుపులోకి తీసుకున్నారని తెలుస్తుంది. వివేకాను హత్య చేస్తే 40 కోట్లు ఇస్తామని వివేక అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి...

తనతో చెప్పాడని దస్తగిరి సీబీఐ కి వాంగ్మూలం ఇవ్వడంతో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. ఈనెల 15న విచారణకు హాజరు కావాలని శివశంకర్ రెడ్డికి సిబిఐ నోటీసులు ఇవ్వడం హాట్ టాపిక్ అయింది. అనారోగ్య కారణంతో రాలేకపోతున్నాను శివశంకర్ రెడ్డి సమాధానం ఇవ్వగా... శివ శంకర్ రెడ్డి ని హైదరాబాద్ లో అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు సిబిఐ అధికారులు. ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు పూర్తి చేసి కడప తరలించారు అధికారులు.  ట్రాన్సిట్ వారెంట్ కోసం నాంపల్లి మేజిస్ట్రేట్ ముందు హాజరు  పరిచింది అని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: