మూడు రోజుల నుంచి ఉత్కంట రేపుతున్న కొండపల్లి మున్సిపల్ ఎన్నికకు సంబంధించి ఉత్కంట తొలగింది. కొండపల్లి మున్సిపల్ ఎన్నికల్లో మొదటి వార్డు నుండి వరుసగా సభ్యులతో ఒక్కొక్కరితో ప్రమాణ స్వీకారం చేయించారు ఎన్నికల అధికారులు. చైర్మన్ ఎన్నికలో ఎంపి కేశినేని నానీ తో పాటుగా 16 మంది సభ్యులు టీడీపీకి అనుకూలంగా ఓటు వేసారు. చైర్మన్ గా చేన్నుబోయిన చిట్టి బాబు (25 వ వార్డు సభ్యులు)కి వాళ్ళు మద్దతు ఇచ్చారు.

దీనితో కొండపల్లి టీడీపీ కైవసం అయింది. మూడు రోజుల నుంచి అందరూ ఈ ఎన్నిక విషయంలో ఆసక్తిగా చూసారు. వైస్ చైర్మన్ 1&2 ఎన్నిక ప్రారంభం అయింది. ఈ ఎన్నిక విషయంలో విజయవాడ ఎంపీ కేశినేని నానీ చాలా సీరియస్ గా వ్యవహరించారు. వైస్ చైర్మన్ గా శ్రీలక్ష్మి, శ్రీనివాసరావు ని ఎంపిక చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: