ప్రభుత్వంలో ఉద్యోగ సంఘాల జేఏసీ నేతల చర్చలు సఫలమైన నేపథ్యంలో ఆర్టీసీలో సమ్మెపై ఆర్టీసి జెఏసి రాష్ట్ర కమిటి ప్రకటన విడుదల చేసింది. పిఆర్సీ సాధన సమితితో ప్రభుత్వం జరిగిన చర్చలు  సఫలమైనందున రేపట్నుంచి జరుప తలపెట్టిన ఆర్టీసీ సమ్మెను విరమిస్తున్నట్టు ఆర్టీసీ జేఏసీ  ప్రకటించింది. అందువల్ల ఇవాళ తలపెట్టిన  నల్లబ్యాడ్జిలు ధరించడం, ధర్నాలు వాయిదా వేసుకున్నామని ఆర్టీసీ జేఏసీ తెలిపింది.


ఇప్పటికే ఆర్టీసీ ఎండీకి ఇచ్చిన 45 డిమాండ్ల పరిష్కారం కొరకు కృషి చేస్తామని ఆర్టీసీ జేఏసీ తెలిపింది. త్వరలో ఆర్టీసి జేఏసీ కమిటి సమావేశమై.. ఆర్టీసి ఉద్యోగుల డిమాండ్లపై ప్రభుత్వం ఇవ్వనున్న జీవోలపై చర్చిస్తామని ప్రకటించింది. ప్రభుత్వంతో చర్చించాక జేఏసీగా చేపట్టబోవు ఆందోళన కార్యక్రమాలు తెలియజేస్తామని ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు తెలిపారు. నిన్న మొన్నటి వరకు ఆందోళన కార్యక్రమాల్లో  పాల్గొని జయప్రదం చేసిన ఉద్యోగులందరికీ ఆర్టీసీ జేఏసీ అభినందనలు తెలిపింది.


మరింత సమాచారం తెలుసుకోండి: