మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును పోలీసులు అరెస్టు చేశారు. ఆయన్ను అరెస్టు చేసి మైలవరం పీఎస్ కు తరలించారు. మైలవరంలోనే రెవెన్యూ డివిజన్ ప్రకటించాలన్న డిమాండ్‌తో  మాజీ మంత్రి దేవినేని ఉమ.. మైలవరం నాలుగురోడ్ల కూడలి వద్ద ఈ సాయంత్రం ఆందోళన నిర్వహించారు. ఆందోళన తర్వాత తమ డిమాండ్‌ నెరవేర్చాలంటూ ఆయన అక్కడే రోడ్డుపై బైఠాయించారు. దాదాపు రెండున్నర గంటలుగా రోడ్డుపైనే దేవినేని ఉమా బైటాయించారు. దీంతో పోలీసులు భారీగా మోహరించారు.


ఎంత నచ్చజెప్పినా దేవినేని ఉమా వినకపోవడంతో పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. ఆయన్ను అరెస్టు చేసి మైలవరం పీఎస్‌కు తరలించారు. దేవినేని ఉమాను అరెస్టు చేయడంతో టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యకం చేశాయి. పీఎస్‌ వద్దకు భారీగా చేరుకుని నిరసన తెలుపుతున్నారు. దేవినేని ఉమా ను విడుదల చేయాలంటూ భారీగా తెలుగు దేశం శ్రేణులు ఆందోళన చేశాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: