ఇండియాను ఉగ్రవాదం ద్వారా అస్థిరం చేయాలన్నది పాక్ విదేశాంగ విధానంలో ఓ వ్యూహంగా ఎన్నాళ్ల నుంచో ఉంది. అలాంటి పాకిస్తాన్ నోట ఇటీవల శాంతి వచనాలు వెలువడుతున్నాయి. మోడీతో టీవీ చర్చలకు సిద్దమని అప్పట్లో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించి అబాసుపాలయ్యారు. ఇక ఇప్పుడు భారత్‌తో అన్ని వివాదాలను శాంతియుతంగా సంప్రదింపుల ద్వారా పరిష్కారించుకోవాలని కోరుకుంటున్నామని పాక్‌ సైనిక చీఫ్‌ ఖమర్‌ బజ్వా చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోంది.


జమ్ముకాశ్మీర్‌ సహా అన్ని అంశాలు దౌత్య మార్గాల ద్వారా పరిష్కారమవుతాయని తాము విశ్వసిస్తున్నట్లు పాక్ సైన్యం చెప్పడం విశేషమే. భారత్‌ అంగీకరిస్తే చర్చలకు సిద్ధమని బజ్వా అంటున్నారు. ఇస్లామాబాద్‌లో జరిగిన భద్రతా సంప్రదింపుల సదస్సులో బజ్వా ఈ కామెంట్లు చేశారు. గల్ఫ్‌లోని మూడో వంతు, ఇతరప్రాంతాల్లో ఘర్షణలు, యుద్ధాలు జరుగుతున్నాయన్న బజ్వా అలాంటి వాటి నుంచి పాక్‌ ను దూరంగా ఉంచటం ముఖ్యమంటున్నారు. 300కోట్ల మంది శాంతి, శ్రేయస్సు కోసం ఈ ప్రాంతంలోని రాజకీయ నాయకత్వాలు భావోద్వేగాలు, పక్షపాతాలను పక్కనపెట్టాలని చెబుతున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: